BSNL Prepaid Plan: రోజుకు కేవలం రూ.5 ఖర్చుతో 90 రోజుల వ్యాలిడిటీ

BSNL Recharge Plan: కస్టమర్లు మెరుగైన సేవలను పొందగలిగేలా BSNL నిరంతరం కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ అయితే, మంచి ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు ఉత్తమమైనది కావచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 65,000 కంటే ఎక్కువ 4జి మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది..

BSNL Prepaid Plan: రోజుకు కేవలం రూ.5 ఖర్చుతో 90 రోజుల వ్యాలిడిటీ

Updated on: Mar 03, 2025 | 6:17 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. రోజురోజుకు వినియోగదారులను పెంచుకుంటోంది. ప్రైవేట్‌ కంపెనీలు రీఛార్జ్‌ ధరలు పెంచిన తర్వాత లక్షలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. యూజర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు రోజుకు కేవలం రూ. 5 ధరకే 90 రోజుల చెల్లుబాటును అందిస్తోంది.ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత SMS వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Account: ఈ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్‌ బ్లాక్‌!

ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ ధర రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్, దీనిని కంపెనీ ఇటీవల ప్రారంభించింది. కంపెనీ తన X హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని అందించింది. ఇది దేశంలో ఎక్కడైనా ఉచిత రోమింగ్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. కంపెనీ తన వినియోగదారులకు తక్కువ ధరలకు దీర్ఘకాలిక చెల్లుబాటుతో సరసమైన ప్లాన్‌లను నిరంతరం అందిస్తోంది. అంతేకాకుండా BSNL కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇప్పటివరకు 65,000 టవర్లను సైతం ఏర్పాటు చేసింది.మరిన్ని టవర్లను ఏర్పాటు పనిని వేగవంతం చేసింది.

90 రోజుల ప్లాన్

BSNL రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తం 300 SMSలను పొందుతున్నారు. అయితే, ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఎటువంటి ఇంటర్నెట్ డేటాను పొందడం లేదు. కానీ వినియోగదారులు కోరుకుంటే వారు డేటా ప్యాక్ టాప్‌అప్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో వినియోగదారులు 90 రోజుల చెల్లుబాటును పొందవచ్చు.

డేటా అవసరం లేని, దీర్ఘకాలిక చెల్లుబాటు కోరుకునే వినియోగదారులకు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉత్తమ ఎంపిక. మీరు రోజుకు రూ.5 కంటే తక్కువ ఖర్చు చేయడం ద్వారా మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: March 31st Deadline: మార్చి 31 వరకు గడువు.. లేకుంటే ఇబ్బందులు తప్పవు!

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి