BSNL New Prepaid Plan: రూ.447తో బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. 60 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలు

|

Jul 06, 2021 | 1:41 PM

BSNL New Prepaid Plan: టెలికం రంగంలో భారీ పోటీ నెలకొంది. ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా పోటా పోటీగా కొత్త ప్లాన్లను తీసుకువస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి...

BSNL New Prepaid Plan: రూ.447తో బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. 60 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలు
Follow us on

BSNL New Prepaid Plan: టెలికం రంగంలో భారీ పోటీ నెలకొంది. ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా పోటా పోటీగా కొత్త ప్లాన్లను తీసుకువస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) కూడా కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.447 లతో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ ద్వారా 100 జీబీ హై-స్పీడ్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ అందిస్తోంది. అంతేకాదు 100 ఎస్‌ఎంఎస్‌లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ అందిస్తోంది. అలాగే ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల వ్యాలిడిటీ కల్పిస్తోంది. ఇంతలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.247 ధర ఉన్న స్వల్పకాలిక వోచర్‌లను, 1999 రూపాయల ధర గల రీపెయిడ్‌ ప్లాన్‌ వోచర్లను కూడా పునరుద్దరించింది. ఈ రెండు వోచర్‌లలో రోజు వారీ వినియోగ పరిమితులను తొలగించింది.

జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా 60 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ ప్రారంభించిన వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ప్రారంభించింది. ఇదే ప్లాన్‌లో జియో, వోడాఫోన్‌ ఐడియా రూ.447 ప్లాన్‌ అందిస్తుండగా, ఎయిర్‌టెల్‌ రూ.456తో అందిస్తుంది.

జియో ప్రీపెయిడ్‌ రూ.447 ప్లాన్‌తో 60 రోజు వ్యాలిడిటీతో పాటు 50 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ అందిస్తుంది. ఇక వోడాఫోన్‌ ఐడియా రోజువారీ డేటా పరిమితితో రూ.447 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 60 రోజులు. ఇందులో అపరిమిత కాల్స్‌, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, అలాగే టీవీకి యాక్సెస్‌ అందిస్తోంది.

ఎయిర్‌టెల్‌ రూ.456 తో అందిస్తోంది. ఇందులో 60 రోజుల వ్యాలిడిటీ, 50జీబీల డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. ఇక డేటా అయిపోయిన తరువాత వినియోగదారుడు ఎంబీకి 50పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌, ఉచిత హలో ట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ ప్రీమియం, ఫాస్టాగ్‌లో రూ.100 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Toshiba Inverter AC: అమెజాన్‌లో రూ.96,700 విలువైన ఇన్వర్టర్‌ ఏసీ.. కేవలం రూ.5,900లకే.. లాభపడిన కస్టమర్లు

Nokia G20: భారత్‌ మార్కెట్లోకి నోకియా బడ్జెట్ ఫోన్ విడుదల..అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..?