BSNL నుంచి మరో హోలీ ఆఫర్‌.. ఈ ప్లాన్‌లో 29 రోజులు అదనపు వ్యాలిడిటీ!

BSNL Offer: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్ అయితే మీకో శుభవార్త. బీఎస్ఎన్ఎల్ తన 9 కోట్లకు పైగా వినియోగదారుల కోసం హోలీ ధమాకా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటును పెంచుతున్నట్లు ప్రకటించింది..

BSNL నుంచి మరో హోలీ ఆఫర్‌.. ఈ ప్లాన్‌లో 29 రోజులు అదనపు వ్యాలిడిటీ!
దీనితో పాటు, కంపెనీ ఈ ప్లాన్‌లో 100 ఉచిత SMS సౌకర్యాన్ని అందిస్తోంది. తక్కువ డబ్బు ఖర్చు చేస్తూ వీలైనన్ని ఎక్కువ రోజులు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాల్సిన వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది.

Updated on: Mar 07, 2025 | 7:15 AM

హోలీ సందర్భంగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 9 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. కంపెనీ హోలీ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ధమాకా ఆఫర్ కింద BSNL ఇప్పుడు రూ.1499 ప్లాన్‌తో 29 రోజుల చెల్లుబాటును ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాలిడిటీతో కలిపి ఈ ప్లాన్‌ 365 రోజులు అవుతుంది. BSNL ఈ ప్లాన్‌తో మీకు అపరిమిత టాక్‌టైమ్‌, డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. కంపెనీ తన అధికారిక X హ్యాండిల్ నుండి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్, హోలీ ఆఫర్ గురించి తెలుసుకోండి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 1499 ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ఎక్కువ డేటా అందించదు.కాబట్టి మీ డేటా వినియోగం తక్కువగా ఉంటే ఈ ప్లాన్ మీకు ఉత్తమమైనది. ఈ ప్లాన్‌లో మొత్తం 365 రోజులు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.ఆఫర్‌కు ముందు ఈ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటు అందించేది.

మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్ యాప్ నుండి రీఛార్జ్ చేయడం ద్వారా మీరు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కాకుండా బీఎస్ఎన్ఎల్ మరో ప్లాన్‌తో అదనపు చెల్లుబాటును అందిస్తున్నట్లు ప్రకటించింది. తన రూ. 2,399 రీఛార్జ్ ప్లాన్ తో 30 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు ఈ ప్లాన్ 395 రోజుల చెల్లుబాటు ఉండేది. ఇప్పుడు కంపెనీ ఈ ప్లాన్ లో 425 రోజుల చెల్లుబాటును అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి