BSNL: బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ.. డైలీ 2GB డేటా..

దేశీయ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే మెరుగైన ప్లాన్‌లను అందిస్తోంది. రూ.500 లోపు 72 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. రూ.2399 వార్షిక ప్లాన్ కూడా ఉంది. స్వదేశీ టెక్నాలజీతో BSNL 5G సేవలను త్వరలో ప్రారంభించనుంది.

BSNL: బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ.. డైలీ 2GB డేటా..
Bsnl Recharge Offers

Updated on: Dec 06, 2025 | 6:27 PM

దేశీయ టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన యూజర్లకు అతితక్కువ ధరల్లో మెరుగైన డీల్స్‌ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఆఫర్లకు ప్రైవేట్ సంస్థలు దరిదాపుల్లో కూడా లేవు. తక్కువ ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీని కోరుకునే లక్షలాది మంది వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.500 కంటే తక్కువ ధరలో 72 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అద్భుతమైన రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు లభించే ప్రధాన ప్రయోజనాలు

  • వ్యాలిడిటీ: 72 రోజులు.
  • కాలింగ్: అన్‌లిమిటెడ్ కాల్స్
  • డేటా: రోజుకు 2GB హై-స్పీడ్ డేటా.
  • SMS: రోజుకు 100 ఉచిత SMSలు.
  • అదనపు ప్రయోజనం: BiTV (బిఎస్‌ఎన్‌ఎల్ టీవీ)కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
  • ఈ సరసమైన ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీ, తక్కువ ధర కోసం చూస్తున్నవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఏడాది ప్లాన్ కూడా తక్కువగానే..

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల చెల్లుబాటు ప్లాన్‌ను కూడా కేవలం రూ.2399 ధరకే అందిస్తోంది. ఈ వార్షిక ప్లాన్‌లో కూడా 2GB రోజువారీ డేటా, 100 ఉచిత SMS సందేశాలు, అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

BSNL 5G ప్రణాళికలు – స్వదేశీ నెట్‌వర్క్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4G సేవలను విస్తరిస్తున్న BSNL త్వరలో 5G సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం.. BSNL వచ్చే ఏడాది ప్రారంభంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తొలి దశలో ఢిల్లీ, ముంబై వంటి రెండు మెట్రో నగరాల్లో పరిమిత సైట్లతో 5G సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల BSNL దేశం అంతటా ప్రారంభించిన 4G నెట్‌వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. ఇది 5Gరెడీగా ఉండటం వలన బీఎస్ఎన్ఎల్ తక్కువ సమయంలోనే 5Gకి మారడం సులభతరం అవుతుంది. స్వదేశీ నెట్‌వర్క్ అనేది భద్రత, దేశీయ సాంకేతిక అభివృద్ధికి ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి