కోవిడ్ వల్ల దేశంలో ఫుడ్ పరిశ్రమల ఆదాయంలో భారీగా వ్యత్యాసం వచ్చింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ లాక్‌డౌన్ అమలవుతున్న పరిస్థితి. కోవిడ్ తెచ్చిన నష్టాల వల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. లాక్‌డౌన్ వల్ల పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోవడం, సిబ్బంది లేపకోవడం వల్ల ఎక్కడి ఉత్పత్తి అక్కడే ఆగిపోయిన పరిస్థతి. దీంతో ఫుడ్ పరిశ్రమలు నష్టాలు చవిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలను భరించేందుకు ఇప్పటికే పలు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న పలు సంస్థలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
తాజాగా బ్రిటాయని కూడా క్రమంగా తన ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో కమోడిటీస్ ఇంఫ్లేషన్ అధికంగా ఉన్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను క్రమంగా పెంచే యోచనలో ఉన్నట్టు సంస్థ ఎంపీ వరుణ్ బెర్రీ తెలిపారు. క్రమంగా ధరల పెరుగుదల, మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తుల విడుదల సహా ఈ కామర్స్ వ్యాపారాన్ని పెంచుకోవాలని బ్రిటానియా భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 2 శాతం ఈ కామర్స్ వ్యాపారాన్ని 5 శాతానికి పెంచుకోవాలని బ్రిటానియా లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిటాయా తన ఉత్పత్తుల ధరల పెంపు నిర్ణయం ప్రకటించడంతో కంపెనీ షేర్ల విలువలో పెరుగుల కనిపించింది.