Indian Railway: రైల్వే టికెట్స్‌పై ఉండే ఈ కోడ్‌ల అర్థాలు ఏమిటో తెలుసా..?

|

Jun 04, 2023 | 5:08 PM

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది రైల్లో ప్రయాణిస్తుంటారు. టికెట్‌ ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రైలు ప్రయాణం చేయాలంటే చాలా మంది ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకుంటారు. నేరుగా..

Indian Railway: రైల్వే టికెట్స్‌పై ఉండే ఈ కోడ్‌ల అర్థాలు ఏమిటో తెలుసా..?
Indian Railways
Follow us on

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది రైల్లో ప్రయాణిస్తుంటారు. టికెట్‌ ఛార్జీలు తక్కువ ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రైలు ప్రయాణం చేయాలంటే చాలా మంది ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకుంటారు. నేరుగా రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీలోనూ బుకింగ్‌ చేసుకుంటారు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో టికెట్‌ రద్దయ్యే అవకాశం ఉంటుంది. లేదా టికెట్‌ కన్ఫర్మ్‌ కాకుండా వెయిటింగ్‌ లిస్ట్‌లో కూడా ఉంటుంది. మరి టికెట్‌పై కొన్ని పదాలు ఉంటాయి. వాటి అర్థాలు చాలా మందికి తెలియవు. కొన్ని సార్లు రద్దీగా ఉండే మార్గం కారణంగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ కావడం కష్టంగా ఉంటుంది. అయితే రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్నప్పుడు సాధారణంగా బెర్త్‌ కన్ఫర్మ్‌ అయితే కన్ఫర్మ్‌ అయినట్లు స్టేటస్‌ చూపిస్తుంది. అలాగే వేయిటింగ్‌ లిస్టులో కూడా కొన్ని పదాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా టికెట్లు బుక్‌ చేసుకున్న సమయంలో PQWL, RLWL, GNWL, RLGN, RAC, WL,RSWL, CKWL అనే పదాలు కనిపిస్తుంటాయి. వీటికి అర్ధాలు అందరికి తెలియవు. వాటి అర్థం ఏంటో తెలుసుకోండి.

  • GNWL: General Waiting List: రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలో ఈ జీఎన్‌డబ్ల్యూఎల్‌ (GNWL) ఉంటుంది. ఇలా కనిపిస్తే బెర్త్ క‌న్‌ఫాం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయని అర్థం. రైలు ప్రారంభమయ్యే స్టేష‌న్ లేదా దాని రూట్‌లో ఉన్న ఏదైనా స్టేష‌న్ నుంచి మ‌నం టికెట్లను బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ఇలా మ‌న‌కు చూపిస్తుంది.
  • RAC (Reservation Against Cancellation): ఈ జాబితాలో రైల్వే టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్ఏసీ (RAC)లో ఉంటే చాలా వ‌ర‌కు టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయిపోతాయి. అయితే కొన్ని సందర్భాలలో ఒకే బెర్త్‌లో ఇద్దరికి కేటాయించబడుతుంది. సర్దుబాటు చేసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి తక్కువ సమయంలో ఎదురవుతుంటాయి.
  • WL (Waiting List): ఇది వెయిటింగ్‌ లిస్ట్‌. మీరు టికెట్‌ బుక్‌ చేశాక టికెట్‌ కన్ఫర్మ్‌ కాకపోతే ఇది చూపిస్తుంది. టికెట్లు కన్ఫర్మ్‌ అయిన వారు ఎవరైనా రద్దు చేసుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు WL12 అని రాసి ఉంటే 12వ వ్యక్తి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే మీకు టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశం ఉంటుందని అర్థం.
  • PQWL (A Pooled Quota Waiting List): ఒక రైలుకు కేవలం ఒక పూర్తి కోట మాత్రమే ఉంటుంది. రైలు ప్రారంభమయ్యే, రైలు నిలిచిపోయే స్టేష‌న్‌ల‌కు టికెట్లను ఇస్తారు. లేదా రైలు నిలిచిపోయే స్టేష‌న్‌కు ఒక‌టి రెండు స్టేష‌న్ల ముందు వ‌ర‌కు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో మార్గమధ్యలో ఉన్న రెండు స్టేషన్‌లకు ఈ లిస్టును చూపిస్తారు. అనేక రైల్వే స్టేషన్‌లలో బెర్త్‌లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే ఒకే ఫూల్‌ కోటలో చూపిస్తాయి. ఇవి కూడా కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా రైలు టికెట్లపై ఉండే పదాలను ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
  • RLWL (Remote Location Waiting List): రైలు టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్‌లో ఇలా స్థితి ఉంటే ఈ టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయ్యేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని అర్థం. రైలు ప్రయాణించే మార్గంలో ఏదైనా స్టేషన్‌లో బెర్త్‌లు ఖాళీలు అయ్యే అవకాశాలు ఉంటే ఇలా చూపిస్తుంది.
  • RQWL (Request Waiting List): మార్గమధ్యంలో ఉండే ఒక స్టేషన్‌ నుంచి ఇంకో స్టేషన్‌కు టికెట్‌ బుక్‌ చేస్తే అది జనరల్‌ కోటాలో లేదా రిమోట్‌ లొకేషన్‌ లేదా పూర్తి కోటలో చూపించబడకపోవడాన్ని ఈ జాబితాలో చూపిస్తుంది.
  • TQWL(formerly CKWL): ఇది తాత్కాల్‌ కోట కిందకు వస్తుంది. గతంలో తత్కాల్‌ కోటలో సీకేడబ్ల్యూఎల్‌ (CKWL) చూపించే వారు. కానీ ఇప్పుడు టీక్యూడబ్ల్యూఎల్‌ (TQWL)గా మార్చింది రైల్వే శాఖ.
  • RSWL (Roadside Station Waiting List): ఇలా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఏవైనా బెర్త్‌లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే ఇలా చూపిస్తుంది. ఇవి కూడా ఖరారు అయ్యే అవకాశం చాలా తక్కువ అని అర్థం చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి