బీఎమ్‌డబ్ల్యూ జాయ్ డేస్ .. మార్చి 31న ముగియనున్న ఆఫర్.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

|

Mar 15, 2021 | 9:39 PM

BMW JOY DAYS OFFER : బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ జాయ్ డేస్ పేరిట ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ మార్చి 31

బీఎమ్‌డబ్ల్యూ జాయ్ డేస్ .. మార్చి 31న ముగియనున్న ఆఫర్.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
Bmw Joy Days Offer
Follow us on

BMW JOY DAYS OFFER : బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ జాయ్ డేస్ పేరిట ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. కారు కొనాలనుకునే వారు ఈ లోపు కొనుగోలు చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ధర, ఫీచర్ల విషయంలో చాలా మేరకు తగ్గింపుతో పాటు అదనపు లాభం చేకూరుతుంది. వినియోగదారులు గమనించాలని కంపెనీ ప్రతినిధులు కోరుతున్నారు. 2007 నుంచి దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బీఎండబ్ల్యూ.. ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది.

ఈ ఆఫర్ ద్వారా ఎటువంటి సేవలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం. 4.99 శాతం నుంచి ప్రారంభయ్యే వడ్డీ రేట్లు, జీరో డౌన్‌ పేమెంట్‌, బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై 5 లక్షల వరకు తరుగుదల, అదనపు ప్రయోజనాలను ఇస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ యాక్సెసరీస్‌పై 50 శాతం వరకు రాయితీ వంటి సదుపాయాలు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ స్వల్పకాలికమేనని, మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని బీఎండబ్ల్యూ డీలర్లను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో 530i స్పోర్ట్స్‌ వేరియంట్‌ ధర రూ.56 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని 530d M స్పోర్ట్‌ వేరియంట్‌ ధర గరిష్ఠంగా రూ.69.1 లక్షల వరకూ ఉంది. జీరో డౌన్‌పేమెంట్‌ సదుపాయం కల్పించారు. వడ్డీ రేటు 4.99 శాతం నుంచి మొదలవుతుంది. కాంప్లిమెంటరీ సర్వీస్‌ ప్లాన్‌ మూడేళ్లు /40వేల కి.మీ. లిమిట్ ఉంటుంది. రూ.4.41 లక్షల వరకు తరుగుదల, అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

ఎస్‌డ్రైవ్‌ 20i స్పోర్ట్స్‌ ఎక్స్‌ వేరియంట్‌ రూ.37.2 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఎస్‌డ్రైవ్‌ 20d ఎం స్పోర్ట్‌ మోడల్‌ వేరియంట్‌ గరిష్ఠంగా రూ.42.9 లక్షలు పలుకుతోంది. నెలవారీ చెల్లింపుల సదుపాయం రూ.39,999 నుంచి ప్రారంభమవుతుంది. బైబ్యాక్‌ పై 42 శాతం కచ్చితమైన హామీ ఉంటుంది. తరుగుదల, అదనపు ప్రయోజనాలు రూ.2.95 లక్షల వరకు లభిస్తాయి.

Suriya’s Soorarai Pottru : ఆస్కార్ రేస్ నుంచి తప్పుకున్న సూర్య సినిమా.. నిరాశలో అభిమానులు

ఆస్ట్రేలియాలో మహిళలకు కోపం వచ్చింది. ఆడవారిపై అఘాయిత్యాలను ఆపాలంటూ నల్ల బట్టలు ధరించి నిరసన