Bike Price Hike: కొత్త ఏడాదిలో బైక్‌ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఈ బైక్‌ ధరలు!

|

Nov 30, 2024 | 1:46 PM

Bike Price Hike: కొత్త ఏడాది వచ్చేందుకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది. తర్వాత 2025 సంవత్సరం రానుంది. ఈ ఏడాదిలో మార్పు, చేర్పలు చోటు చేసుకోన్నాయి. ముఖ్యంగా ఈ బైక్‌ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. జనవరి 1వ తేదీ నుంచి ఈ బైక్‌ ధరలు మరింత ప్రియం కానున్నాయి..

Bike Price Hike: కొత్త ఏడాదిలో బైక్‌ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఈ బైక్‌ ధరలు!
Follow us on

కొత్త సంవత్సరానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. న్యూ ఇయర్ రాకతో తేదీ మారడమే కాదు, చాలా విషయాలు కూడా మారుతాయి. అదే సమయంలో చాలా మంది వాహన తయారీదారులు తమ విధానాలను మార్చుకుంటారు. కొన్ని కార్లు ఖరీదైనవి, కొన్ని చౌకగా మారతాయి. కాగా జనవరి 1 నుంచి బిఎమ్‌డబ్ల్యూ తన బైక్‌ల ధరలను పెంచబోతోంది. BMW Motorrad ఇండియా కూడా అన్ని మోడళ్ల ధరలను పెంచబోతోంది. బైక్‌ల ధర 2.5 శాతం పెరగనుంది.

ఈ బైక్‌లు మరింత ఖరీదు:

భారత్‌లో బీఎమ్‌డబ్ల్యూ కార్లకే కాదు బైక్‌లకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రజలు కూడా BMW స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు జనవరి 1 నుండి BMW Motorrad తన అన్ని ద్విచక్ర వాహనాల ధరలను పెంచబోతోంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా అన్ని రేంజ్‌ల మోటార్‌సైకిళ్ల ధరలను పెంచబోతున్నట్లు వాహన తయారీదారులు చెబుతున్నారు. బీఎండబ్ల్యూ గ్రూప్ అనుబంధ సంస్థ BMW Motorrad ఏప్రిల్ 2017లో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి బీఎండబ్ల్యూ బైక్‌లు, స్కూటర్‌లు భారతీయ మార్కెట్లోకి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో BMW మోటోరాడ్ మోడల్స్: 

దేశంలో BMW Motorradకు చెందిన 27 మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లలో 24 మోటార్ సైకిళ్లు, మూడు స్కూటర్లు ఉన్నాయి. ఈ మూడు స్కూటర్ల జాబితాలో CE 02, CE 04, C 400 GT ఉన్నాయి. ఇందులో బీఎమ్‌డబ్ల్యూ సిఇ 04 దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ తర్వాత, CE 02 లాంచ్ చేసింది. ఇది మార్కెట్‌లో రూ. 5 లక్షల రేంజ్‌లో విడుదలైంది.

బీఎండబ్ల్యూ చౌకైన బైక్ గురించి మాట్లాడినట్లయితే.. BMW G 310 R వాహన తయారీదారుల అత్యంత సరసమైన బైక్. ఈ మోటార్‌సైకిల్ ధర రూ.2.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన BMW బైక్ M 1000 RR. ఈ ద్విచక్ర వాహనం ధర దాదాపు రూ.55 లక్షలు.

ఇది కూడా చదవండి: iPhone 17 Pro: ఐఫోన్‌ 17 ప్రోలో కొత్త చిప్, సరికొత్త డిజైన్‌ ఉండనుందా? ఈ ఫీచర్స్‌ నిజమేనా?

ఇది కూడా చదవండి: New Rules: డిసెంబర్‌ 1 నుంచి ఏయే రూల్స్‌ మారనున్నాయో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి