NPS: ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే రోజున సెటిల్‌మెంట్.. జూలై ఒకటి నుంచే ప్రారంభం..

|

Jun 30, 2024 | 5:57 PM

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అందరికీ ఉపయోగపడే స్కీమ్. దీర్ఘకాలం పాటు కొనసాగే స్కీమ్. ఇందులో ఎవరైన తాము ఉద్యోగం చేస్తున్న సమయం నుంచే పెట్టుబడి ప్రారంభించి, పదవీవిరమణ సమయానికి మెచ్యూరిటీ సాధిస్తారు. ఆ సమయంలో  కొంత కార్పస్ విత్ డ్రా చేసి, మిగిలినది పెన్షన్ రూపంలో నెలానెలా తీసుకునే వీలుంటుంది. 

NPS: ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే రోజున సెటిల్‌మెంట్.. జూలై ఒకటి నుంచే ప్రారంభం..
Pension Scheme
Follow us on

అత్యంత ప్రజాదరణ పొందిన పెన్షన్ పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఒకటి. పదవీ విరమణ కోసం అందరూ దీనిని సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడంతో పాటు నెలా నెలా పెన్షన్ రూపంలో కూడా నగదు అందించే ఈ పథకం గురించి కీలక అప్ డేట్ ఇది. ది పెన్షన్ ఫండ్ రెగ్యూలేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ)ఈ కొత్త విషయాన్ని ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి టీ ప్లస్ జీరో సిస్టమ్, షేర్లలోని ట్రేడ్లను ఒకేసారి సెటిల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే షేర్లు వెంటనే కొనుగోలు దారుల ఖాతాకు బదిలీ అవడంతో పాటు విక్రేత ఖాతాలో నిధులు కూడా అదే సమయంలో జమైపోతాయి.

అదే రోజు ప్రయోజనం..

ఎన్పీఎస్ ఖాతాదారుడు ఏదైనా సెటిల్‌మెంట్ దరఖాస్తు చేస్తే.. ఆ రోజున ఉదయం 11 గంటల (టి) వరకు ట్రస్టీ బ్యాంక్ స్వీకరించిన ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్‌లు అదే రోజున ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సబ్‌స్క్రైబర్‌లు అదే రోజు ఎన్‌ఏవీ (నెట్ అసెట్ వాల్యూ) ప్రయోజనం పొందుతారని పీఎఫ్‌ఆర్‌డీఎ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు, ట్రస్టీ బ్యాంక్ ద్వారా స్వీకరించిన కంట్రీబ్యూషన్లు మరుసటి సెటిల్‌మెంట్ రోజున (టీ+1) పెట్టుబడి పెట్టేలా రూల్స్ ఉన్నాయి. అంటే ఈ రోజు వరకు వచ్చిన కంట్రిబ్యూషన్ లను మరుసటి రోజు పెట్టుబడి పెట్టే వారు. అయితే ఏదైనా సెటిల్‌మెంట్ రోజున ఉదయం 9:30 గంటలలోపు అందుకున్న డి-రెమిట్ కంట్రిబ్యూషన్‌లు ఇప్పటికే అదే రోజు పెట్టుబడి కోసం పరిగణించబడ్డాయి. ఇప్పుడు ఉదయం 11 గంటల వరకు అందుకున్న డి-రెమిట్ కంట్రిబ్యూషన్‌లు కూడా అదే రోజు వర్తించే ఎన్‌ఏవీతో పెట్టుబడి పెట్టబడతాయి. అంటే (టీ+0)గా అదే రోజు పెట్టుబడి పెడతారు.

రివైజ్డ్ టైం లైన్స్..

రివైజ్ చేసిన టైం లైన్స్ ప్రకారం పాయింట్స్ ఆప్ ప్రసెన్స్(పీఓపీఎస్), నోడల్ ఆఫీసెస్, ఎన్పీఎస్ ట్రస్ట్ ఫర్ ఈఎన్పీఎస్ వంటివి అడ్జస్ట్ చేసుకోవాలని, తద్వారా వినియోగదారులకు త్వరితగతిన ప్రయోజనాలను అందించాలని పీఎఫ్ఆర్డీఏ ఆదేశించింది. దీంతో ఎన్పీఎస్ సబ్ స్క్రైబర్స్ అధిక ప్రయోజనం పొందే వీలుంటుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అందరికీ ఉపయోగపడే స్కీమ్. దీర్ఘకాలం పాటు కొనసాగే స్కీమ్. ఇందులో ఎవరైన తాము ఉద్యోగం చేస్తున్న సమయం నుంచే పెట్టుబడి ప్రారంభించి, పదవీవిరమణ సమయానికి మెచ్యూరిటీ సాధిస్తారు. ఆ సమయంలో  కొంత కార్పస్ విత్ డ్రా చేసి, మిగిలినది పెన్షన్ రూపంలో నెలానెలా తీసుకునే వీలుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..