Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్.. మార్చి 31 నాటికి అంతా రెడీ.. సిద్దంగా ఉండండి

వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం రైల్వే ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇవి అందుబాటులోకి వస్తాయా అని చూస్తున్నారు. ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ గత నెలలో ప్రారంభమైంది. ఈ క్రమంలో మరిన్ని రైళ్లు ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్.. మార్చి 31 నాటికి అంతా రెడీ.. సిద్దంగా ఉండండి
Vande Bharat Sleeper

Updated on: Feb 24, 2026 | 6:39 PM

వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఉత్తరపారాకు చెందిన టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ కంపెనీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)తో కలిసి స్లీపర్ వెర్షన్ రైళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ మార్చి 31 నాటికి వందే భారత్ స్లీపర్ రైలు మొదటి రేక్ కోసం కార్ బాడీలను పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. 16 కోచ్‌లతో కూడిన 80 వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్‌లను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తోన్నాయి. మార్చి 2026 నాటికి తొలి రేక్‌కు అవసరమైన 16 కార్ బాడీల తయారీ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ చౌదరి తన ప్రకటనలో తెలిపారు.

2027 నాటికి మరిన్ని రైళ్లు

2027 ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి మొదటి రైలు కార్ బాడీని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా జరుగుతుండగా.. రాబోయే ఆర్ధిక సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు ఉమేష్ చౌదరి తెలిపారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలు వెర్షన్ ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కాగా వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారుచేసే బాధ్యతలను మూడు కంపెనీలకు రైల్వేశాఖ అప్పగించింది. బీఈఎంఎల్, కైనెట్ రైల్వే సొల్యూషన్స్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్- భారత్ హెవీ ఇంజినీరింగ్ కన్సాల్టియంకు కాంట్రాక్టులు ఇచ్చింది. జనవరి 2026లో ప్రారంభించిన హౌరా-కామాఖ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును చెన్నైకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సాంకేతికను ఉపయోగించుకుని బీఈఎంఎల్ అభివృద్ది చేసింది.

అత్యాధునిక సౌకర్యాలు

వందే భారత స్లీపర్ రైళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది. రాత్రుల్లో ప్రయాణానికి ఇవి అనువైన ఎంపికగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎలాంటి కుదుపులు, శబ్దాలు వినిపించవు. రాత్రి సమయాల్లో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా నిద్రపోతూ ప్రయాణం చేయవచ్చు. అలాగే అత్యాధునిక టాయిలెట్లు, సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఇక వీటిల్లో టికెట్‌తో పాటు ఫుడ్ ఉచితంగా అందిస్తారు. స్థానిక వంటకాలను వీటిల్లో వడ్డిస్తారు. ఈ ఏడాదిలో మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు స్లీపర్ రైళ్ల తయారీ వేగంగా జరుగుతోంది. ఇవి అందుబాటులోకి వస్తే రాత్రివేళ ప్రయాణంలో మరింత వేగం పెరగనుంది.

 

Follow Us