AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఏఐ కూడా ఏం చేయలేదు.. ఇంటి నుంచే స్టార్ట్ చేయగలిగే చిన్న వ్యాపారాలు ఇవే.. ఖర్చు కూడా తక్కువే..

ఇంటి నుంచే వ్యాపారం మొదలుపెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ప్రస్తుతం మార్కెట్లో అనేక వ్యాపారులకు మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ డబ్బులతో మొదలుపెట్టగలిగే వ్యాపారాలు చాలా ఉన్నాయి. వీటిని స్టార్ట్ చేయడం ద్వారా స్వయం ఉపాధితో పాటు మంచి ఆదాయం పొందవచ్చు.

Business Ideas: ఏఐ కూడా ఏం చేయలేదు.. ఇంటి నుంచే స్టార్ట్ చేయగలిగే చిన్న వ్యాపారాలు ఇవే.. ఖర్చు కూడా తక్కువే..
Business Ideas
Venkatrao Lella
|

Updated on: Jul 03, 2026 | 8:05 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రతీ రంగంలోకి ఏఐ వేగంగా దూసుకొచ్చింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. పది మంది చేసే పనిని ఏఐ సాయంతో ఒక వ్యక్తి చేయవచ్చు. ఉద్యోగాలు లేకపోవడంతో చాలామంది తక్కువ పెట్టుబడి కలిగిన వ్యాపారాల కోసం చూస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే బిజినెస్‌లు చాలానే ఉన్నాయి. మీ అభురుచికి తగ్గ వ్యాపారాన్ని మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందవచ్చు. వ్యాపారం అంటే రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రూ.వేలల్లో ఖర్చు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. చిన్న వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం

ఇటీవల సిటీలలో హోం మేడ్ ఫుడ్‌కు బాగా డిమాండ్ పెరుగుతోంది. మీకు వంట చేయడం ఇష్టమైతే టిఫిన్, లంచ్, డిన్నర్ లాంటివి ప్రిపేర్ చేసి విక్రయించవచ్చు. మీ పరిసరాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు లేదా సీనియర్ సిటిజన్లకు సర్వీసులు అందించడం వల్ల మంచి ఆదాయం పొందవచ్చు. ఇక మీకు కుట్టుపని లేదా ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చి ఉంటే బొటిక్ లేదా టైలరింగ్ షాపు పెట్టుకోవచ్చు. టైలరింగ్ సేవలకు సంవత్సరం పొడవునా డిమాండ్ ఉంటుంది. మీకు కస్టమర్లు పెరిగే కొద్ది ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది. ఇక బ్యూటీ సెలూన్ లేదా హోం పార్లర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు ఇంటి నుండే సేవలను అందించవచ్చు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో మీ ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించవచ్చు. లేదా ఒక షాపు అద్దెకు తీసుకుని బ్యూటీ సెల్యూన్ మొదలుపెట్టవచ్చు. నమ్మకమైన కస్టమర్లను సంపాదించుకుంటే మీకు ఆదాయం కూడా పెరుగుతుంది.

ఇంటి నుంచే వ్యాపారం

ఇక కొవ్వొత్తులు, సబ్బులు, ఆభరణాలు, గృహాలంకరణ లాంటివి చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, ఇంటి నుండే ప్రత్యేకమైన సృజనలను ప్రదర్శించడం, విక్రయించడాన్ని గతంలో కంటే సులభతరం చేశాయి. దీంతో ఇంట్లో వస్తువుల తయారుచేసి ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. ఇక మీకు చదువు, సంగీతం, నృత్యం, భాషలు లేదా కళలలో ప్రావీణ్యం ఉంటే ఇంటి నుండే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పవచ్చు. వర్చువల్ లెర్నింగ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆన్‌లైన్ తరగతులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇలా మీ ఇంటి నుంచే వ్యాపారాలా స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.

Follow Us