Business Idea: ఈ బిజినెస్‌తో ఏడాదంతా ఆదాయమే.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు

|

Feb 03, 2024 | 5:30 PM

మార్కెట్‌లో ఉల్లికి ఉండే డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటే మంచి వ్యాపారాస్త్రంగా మార్చుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మార్కెట్లో ఉల్లికి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లో ఉల్లి పొడిని ఉపయోగిస్తుంటారు. మార్కెట్‌లో ఉల్లి పొడికి సైతం భారీగా డిమాండ్ ఉంటుంది. అందుకే ఉల్లి పౌడర్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు...

Business Idea: ఈ బిజినెస్‌తో ఏడాదంతా ఆదాయమే.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు
Business Idea
Follow us on

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని అంటుంటారు. ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి. అయితే అదే ఉల్లి మీ కెరీర్‌కు కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా.? సరిగ్గా ఆలోచించాలే కానీ ఉల్లితో భారీగా లాభాలు పొందొచ్చు. ఇంతకీ ఉల్లి ద్వారా ఎలా ఆదాయం పొందొచ్చు.? ఈ బిజినెస్‌కు కావాల్సిన వస్తువులు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

మార్కెట్‌లో ఉల్లికి ఉండే డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటే మంచి వ్యాపారాస్త్రంగా మార్చుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మార్కెట్లో ఉల్లికి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లో ఉల్లి పొడిని ఉపయోగిస్తుంటారు. మార్కెట్‌లో ఉల్లి పొడికి సైతం భారీగా డిమాండ్ ఉంటుంది. అందుకే ఉల్లి పౌడర్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా సుమారు 20 నుంచి 25 శాతం వరకు ఉల్లి కుల్లిపోయి, నిరూపయోగంగా మారుతుంది. అయితే ఉల్లిని సరిగ్గా ఉపయోగించుకొని పౌడర్ తయారు చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు.

ఉల్లి పౌడర్‌ను అన్ని రకాల వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. గ్రామాల్లో దీని గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, పట్టణాల్లో ఉండే వారికి తెలిసే ఉంటుంది. సూపర్ మార్కెట్స్‌లో ఉల్లి పౌడర్‌ ప్యాకెట్స్‌ రూపంలో లభిస్తుంది. వంటకాల్లో ఉల్లిగడ్డకు బుదులుగా ఉల్లి పౌడర్‌ను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా హోటల్స్‌లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇక ఉల్లి పౌడర్‌ తయారీని ప్రారంభించే ముందే.. పలు హోటల్స్‌తో పాటు, సూపర్‌ మార్కెట్స్‌తో ఒప్పందం చేసుకోవాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 600 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. లేదంటే ఇంట్లో స్థలం పెద్దగా ఉన్న ఎంచక్కా ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి డీహైడ్రేటర్ మిషన్‌, గ్రైండర్‌ అవసరం ఉంటుంది. ఈ మిషన్స్‌కు సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ఔత్సాహికులు ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..