Business Ideas: అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు గ్యారెంటీ.! అదేంటంటే

|

Jun 25, 2024 | 1:12 PM

ఉద్యోగం ఎంత వెతికినా దొరకట్లేదా.? అయితే డోంట్ వర్రీ.. రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యువత సొంతంగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకోసమే మీకు ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాం.

Business Ideas: అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు గ్యారెంటీ.! అదేంటంటే
Business Idea
Follow us on

ఉద్యోగం ఎంత వెతికినా దొరకట్లేదా.? అయితే డోంట్ వర్రీ.. రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యువత సొంతంగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకోసమే మీకు ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాం. మీ దగ్గర ఓ అరెకరం భూమి.. లేదా ఎకరం ఉన్నట్లయితే..? నెలకు రూ. లక్షల్లో సంపాదించవచ్చు.

ఆ అరెకరం పొలంలో కూరగాయల సాగు మొదలుపెట్టండి.. తద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా మీ పొలం.. ఏదైనా పట్టణం లేదా నగరానికి దగ్గరలో ఉన్నట్లయితే.. అంతకన్నా ఇంకేం కావాలి.. మీరే కస్టమర్లకు నేరుగా ఈ కూరగాయలను అమ్మవచ్చు. ఉదాహరణకు మీ అరెకరం పొలంలో నాలుగు పంటలు చొప్పున ఓసారి టమోటా, రెండోసారి పచ్చిమిర్చి, మూడోసారి కొత్తిమీర, నాలుగో పంటగా వంకాయ సాగు చేయండి. మీ వ్యవసాయ క్షేత్రానికి పట్టణం లేదా ఏదైనా రద్దీ ప్రాంతం దగ్గరలో ఉన్నట్లయితే.. మధ్యవర్తులతో సంబంధం లేకుండా కూరగాయలను మీరే నేరుగా కస్టమర్లకు విక్రయించవచ్చు.

సీజన్ బట్టి పంటలను మారుస్తూ.. కూరగాయల సాగును కొనసాగిస్తే.. మీకు నెలనెలా మాంచి లాభాలు వస్తాయి. ఈ పండిన కూరగాయలను కస్టమర్లకు విక్రయించేందుకు ఓ కమర్షియల్ ట్రక్ కొనుగోలు చేస్తే మరీ మంచిది. స్థానికంగా ఉన్న కూరగాయల షాపులకు, హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టల్స్‌కు రెగ్యులర్ సప్లయర్‌గా ఉన్నట్లయితే సాయంత్రం వేళ జరిగే సంతల్లో మీరే కూరగాయలు విక్రయిస్తే.. మరింత లాభం పొందే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..