Business Idea: తక్కువ పెట్టుబడితో బిజినెస్.. నష్టం అనేదే ఉండదు..

ప్రస్తుతం చిప్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చిప్స్‌ను ఇష్టంగా తింటున్నారు. బంగాళదుంప చిప్స్‌ తయారీ యూనిట్ ద్వారా వేలలో ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన అనుమతులను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది..

Business Idea: తక్కువ పెట్టుబడితో బిజినెస్.. నష్టం అనేదే ఉండదు..
Business Idea

Updated on: May 11, 2024 | 4:59 PM

ఉద్యోగం చేసే వారిలో చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటున్నారు. అయితే పెట్టుబడి, నష్టాలు వస్తాయేమో అనే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ మంచి ఆలోచన, ప్లానింగ్‌తో బిజినెస్‌ ప్లాన్‌ చేస్తే నష్టాలు లేకుండా లాభాలు ఆర్జించవచ్చు. ఇలాంటి ఓ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం చిప్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చిప్స్‌ను ఇష్టంగా తింటున్నారు. బంగాళదుంప చిప్స్‌ తయారీ యూనిట్ ద్వారా వేలలో ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన అనుమతులను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్‌ సేఫ్టీ నుంచి సర్టిఫికెట్ కూడా ఉండాలి.

మొదట్లో ఇందుకోసం చిన్న చిన్న మిషిన్లు అవసరపడతాయి. బంగాళదుప్పలను చిప్స్‌గా కట్ చేయడానికి మిషిన్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు స్టవ్‌, గ్యాస్‌, ఆయిల్‌ లాంటివి అవసరపడతాయి. అలాగే చిప్స్‌కు రుచిని ఇచ్చే వాటిలో ప్రధానమైంది అందులో ఉపయోగించే మసాలా. అందుకే మంచి మసాలాను సెలక్ట్ చేసుకోవాలి. ఇక చిప్స్‌ తయారీ పూర్తయిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేసేందుకు కవర్స్‌ అవసరపడతాయి.

ఈ కవర్స్‌ను ఆకర్షణీయంగా తయారు చేసుకుంటే వ్యాపారం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ సొంత బ్రాండింగ్‌తో కవర్స్‌ను తయారు చేసుకోవచ్చు. చిప్స్‌ ప్యాకెట్ల తయారీ పూర్తయిన తర్వాత మీకు స్థానికంగా ఉన్న దుకాణాల్లో నేరుగా మీరే వెళ్లి విక్రయించవచ్చు. మొదటి చిన్నగా ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యాపారాన్ని పెంచుతూ పొందొచ్చు. ఇక పెట్టుబడి విషయానికొస్తే చిప్స్‌ తయారీ ప్లాంట్‌ను రూ. 20వేల కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆదాయం కూడా నెలకు కనీసం రూ. 10 వేలు పొందొచ్చు. వర్క్‌ ఫోర్స్‌ను పెంచుకొని ఎక్కువ తయారు చేస్తే ఆదాయం రూ. 30 వేల వరకు కూడా పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..