Business Idea: మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు

|

May 06, 2024 | 6:06 PM

ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. పట్టణాల్లో జీవించే వారు మళ్లీ తిరిగి గ్రామాల బాట పడుతున్నారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్లిన వారు మళ్లీ తిరిగా సొంతూళ్లకు వస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన క్రమంగా పెరుగుతోంది. పట్టణాల్లో గజిబిజీ జీవితాల కంటే ఉన్న ఊరిలో ఆదాయం పొందుతూ మరో నలుగురికి ఉపాధి కలిపించాలని అనుకుంటున్నారు...

Business Idea: మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
Business Idea
Follow us on

ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. పట్టణాల్లో జీవించే వారు మళ్లీ తిరిగి గ్రామాల బాట పడుతున్నారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్లిన వారు మళ్లీ తిరిగా సొంతూళ్లకు వస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన క్రమంగా పెరుగుతోంది. పట్టణాల్లో గజిబిజీ జీవితాల కంటే ఉన్న ఊరిలో ఆదాయం పొందుతూ మరో నలుగురికి ఉపాధి కలిపించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా రకరకాల వ్యాపారాలను అన్వేషిస్తున్నారు. మరి ఉన్న ఊరిలో ఉంటూ మంచి లాభాలను ఆర్జించే కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

* కోళ్ల ఫామ్‌ ఇజినెస్‌ ఎవర్‌ గ్రీన్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి కాస్త స్థలం, కొంత మొత్తంలో పెట్టుబడి ఉంటే చాలు బేసిక్‌ లెవల్ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చికెన్‌ సెంటర్లు, రెస్టరెంట్‌లు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇక పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది.

* ఇక ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్‌లో టీ సెంటర్‌ ఒకటి. ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లో కూడా టీ ఫ్రాంచైజ్‌లు వెలుస్తున్నాయి. కాబట్టి మీరు కూడా మంచి ఏరియా చూసుకొని ఒక మంచి ఫ్రాంచైజ్‌ టీ సెంటర్‌ను ప్రారంభిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. వీటికి సమాంతరంగా స్నాక్స్‌ బిజినెస్‌ను కూడా ప్రారంభించవచ్చు. ఈ బిజిజెస్‌ కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న మరో బిజినెస్‌ ఆయిల్ మిల్‌ ఏర్పాటు. ముఖ్యంగా సోయాబీన్స్, వేరుశెనగ, ఆవాల గింజల నుంచి నూనెను తీయడానికి గ్రామాల్లో ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని స్థానికంగా ఉన్న పట్టణాల్లో విక్రయించుకొని మంచి లాభాలు పొందొచ్చు.

* మెడికల్ షాప్‌ కూడా మంచి బిజినెస్‌ ఐడియాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ముఖ్యంగా మీరే స్వయంగా ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ఒక మెడికల్‌ షాపును ఏర్పాటు చేసుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..