Business Idea: ఇంట్లో ఉంటూనే వ్యాపారం.. తక్కువ పెట్టుబడితే భారీ లాభాలు..

|

Nov 06, 2023 | 4:09 PM

బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా బిస్కెట్స్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. కాబట్టే బిస్కెట్స్‌ తయారీకి భారీ డిమాండ్‌ ఉంటుంది. తక్కువ ఖర్చుతో బిస్కెట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకొని సొంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా ఒక బ్రాండ్‌ను రూపొందించుకొని బిస్కెట్స్‌ను మార్కెట్లో విక్రయించుకోవచ్చు...

Business Idea: ఇంట్లో ఉంటూనే వ్యాపారం.. తక్కువ పెట్టుబడితే భారీ లాభాలు..
Business Idea
Follow us on

ప్రస్తుతం వ్యాపారం చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నదైనా పెద్దదైనా తామే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. అందుకోసం రకరకాల బిజినెస్‌ ఐడియాలను అన్వేషిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో బిస్కెట్ తయారీ ఒకటి.

బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా బిస్కెట్స్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. కాబట్టే బిస్కెట్స్‌ తయారీకి భారీ డిమాండ్‌ ఉంటుంది. తక్కువ ఖర్చుతో బిస్కెట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకొని సొంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా ఒక బ్రాండ్‌ను రూపొందించుకొని బిస్కెట్స్‌ను మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఇంతకీ బిస్కెట్ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చు అవుతుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

బిస్కట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే చాలు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద రూ. 4.1 లక్షల రుణం పొందొచ్చు. ఈ పథకం కింద బ్యాంక్‌ నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. వ్యాపారం ప్రారంభానికి వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను పొందొచ్చు. సుమారు రూ. 90 వేల వరకు చేతిలో నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. బిస్కెట్స్‌ తయారీకి ఓవెన్‌, రిఫ్రిజిరేటర్‌, మిక్సర్‌, గ్రైండర్‌లు అవసరం ఉంటాయి. వీటితో పాటు. పిండి, చక్కెర, వెన్న, గుడ్లు, స్పైసెస్ ఆహార పదార్థాలు అవసరపడుతాయి.

ఇంట్లో కొంత స్థలం ఉంటే చాలు బిస్కెట్ తయారీ కంపెనీని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లైసెన్స్‌, ట్రేడ్‌ మార్క్‌, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ కింద రిజిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. ముందు అన్ని క్లియర్ అయ్యాకే బిజినెస్ ను మొదలు పెట్టాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..