
సాధారణరంగా మంత్లీ ప్లాన్స్ లో 28 రోజుల వ్యాలిడిటీనే ఉంటుంది. పైగా ధర ఎక్కువ. ఈ ప్లాన్స్ తో పోలిస్తే యాన్యూవల్ ప్లాన్స్ తో ఒక నెల రోజులు వ్యాలిడిటీ అదనంగా కలిసొస్తుంది. ఈ యాన్యువల్ ప్లాన్స్ అన్ని ప్రిపెయిడ్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
జియోలో రూ. 3599 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్. జియోటీవీ, హాట్ స్టార్ వంటి సబ్ స్క్రిప్షన్స్ కూడా వస్తాయి. అదే రూ. 3999 ప్లాన్ లో అయితే అదనంగా జియో ఫ్యాన్ కోడ్ సబ్ స్క్రిప్షన్ వస్తుంది. ఫ్యాన్ కోడ్ అనేది జియో వాళ్ల స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ఓటీటీ. ఒకవేళ మీరు జియో ఫోన్ వాడుతున్నట్టయితే.. రూ. 1234కి 336 రోజుల వ్యాలిడిటీ రోజుకి 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియో ఫోన్ ప్రైమా యూజర్స్ కి 336 రోజుల వ్యాలిడిటీ రూ.895 కే లభిస్తుంంది. ఇందులో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.
ఇక ఎయిర్ టెల్ లో రూ. 3599 కి 365 రోజుల వ్యాలిడిటీ డైలీ 2జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిడ్ కాల్స్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఎయిర్ టెల్ లో రూ.2249కే మరో యాన్యువల్ ప్లాన్ ఉంది. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 30జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా ఉండదు.
ఇక వొడాఫోన్ ఐడియా విషయానికొస్తే.. ఇందులో రూ.3599 కి 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్యాక్ లో నైట్ 12 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఫ్రీ డేటా లభిస్తుంది.
ఒకవేళ రూ.3799 పెట్టి రీఛార్జ్ చేస్తే.. అదనంగా అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ వస్తుంది. రోజుకి 1.5 జీబీ డేటా చాలు అనుకుంటే రూ.3499 ప్యా్క్ రీఛార్జ్ చేసుకోవచ్చు. డైలీ డేటా అవసరం లేకపోతే ఏడాది ప్లాన్ రూ.1999 కే లభిస్తుంది. ఇందులో 24 జీబీ డేటా వస్తుంది.
ఇకపోతే బీఎస్ ఎన్ ఎల్ లో రూ.2399 కే 395 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ. 1999 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ 600 జీబీ డేటా వస్తుంది. అలాగే రూ1515 ప్యాక్ తో.. 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి