
భారతదేశం వెలువల నివసించే ఎన్ఆర్ఐలకు ఇక్కడి ఆరోగ్య, టర్మ్ బీమా పాలసీలను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బీమా ప్రీమియాలపై జీఎస్టీ వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు. స్వదేశానికి వచ్చినప్పుడు వారికి, కుటుంబ సభ్యులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భరోసాను అందిస్తాయి. ప్రపంచంలోని మిగిలిన దేశలతో పోల్చితే మన పాలసీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువ కవరేజీని అందజేస్తాయి. భారతీయ బీమా పథకాలను కొనుగోలు చేయడం కోసం ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపులు అందిస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపు కోసం ఈ కింది నిబంధనలు వర్తిస్తాయి.
జీవిత బీమా పాలసీలపై పన్ను ప్రయోజనాలు కూడా ఎన్ఆర్ఐలు పొందవచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ తో జీవిత బీమా పాలసీ తీసుకున్నవారికి పాత పన్ను విధానంలో మినహాయింపు లభిస్తుంది. దాని కింద ప్రీమియాలకు తగ్గింపులను క్లయిమ్ చేసుకోవచ్చు. ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ అవకాశం ఉంటుంది. పన్ను ఆదా కావడంతో బీమాను తగ్గింపు పొందవచ్చు. ఆరోగ్య బీమా పాలసీల విషయానికి వస్తే మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులను కవర్ చేసే పాలసీ ప్రీమియాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డి కింద మినహాయింపు లభిస్తుంది.