Bank Holidays: వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఆ రోజు మాత్రం పనిచేస్తాయి…

|

Mar 23, 2024 | 7:23 AM

ఈ వారంలో ఇన్ని సెలవులున్న నేపథ్యంలో మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఆదివారం అయినప్పటికీ దేశంలోని 33 ఏజెన్సీ బ్యాంకులు పనిచేసేలా ఆర్బీఐ కొత్తగా ఆదేశాలిచ్చింది. వీటిల్లో ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. ఆ రోజున బ్యాంకులు పనిచేస్తాయన్న విషయాన్ని వినియోగదారులకు తెలిసేలా ప్రచారం కూడా నిర్వహించమని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.  

Bank Holidays: వారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఆ రోజు మాత్రం పనిచేస్తాయి...
Bank Holidays
Follow us on

మార్చి నెల అంటే అందరూ పద్దుల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక సంవత్సంరం ముగిసిపోతుంది కాబట్టి ఆర్థిక పరమైన అంశాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్‌ రిటర్న్‌‍్స చేసే పనిలో బిజిబిజీగా ఉంటారు. ఇక బ్యాంకు ఉద్యోగులైతే ఇక చెప్పే పనిలేదు. ఖాతాల వివరాలన్నీ పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్చి చివరి వారంలో వారికి భారీగా సెలవులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం 2024 మార్చి చివరి వారంలో ప్రస్తుతం మిగిలిన ఎనిమిది రోజుల్లో ఏడు సెలవులు ఉన్నాయి. ఇది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సెలవులను ఆధారంగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అయితే రానున్న ఎనిమిది రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. సెలవుల జాబితాలో హెూలీ, గుడ్ ఫ్రైడే, అలాగే నాల్గవ శనివారం, ఆదివారాలు ఉన్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ పండుగల వైవిధ్యమైన వేడుకలను బట్టి, నిర్దిష్ట బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి మారవచ్చు.

ఆర్బీఐ ప్రకటన ఇలా..

కష్టమర్లు తమ నిర్దిష్ట రాష్ట్రాలకు సంబంధించిన సెలవుల షెడ్యూల్ను సమీక్షించుకోవాలని ఆర్బీఐ సూచించింది. తదనుగుణంగా బ్యాంకింగ్ సంస్థలకు వారి సందర్శనలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ ప్రకటన తర్వాత ధ్రువీకరించి ఏడు సెలవుల్లో బ్యాంకుల బ్రాంచ్‌ ఆఫీసులు మూసివేసినప్పటికీ అన్ని డిజిటల్,ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అంతరాయం లేకుండా పని చేస్తాయని స్పష్టం చేసింది. ఇందులో ఆన్లైన్ మనీ ట్రాన్స్‌ఫర్లు, మైక్రోఫైనాన్స్ యాప్స్‌, వాట్సాప్ బ్యాంకింగ్ వంటి ఉన్నాయి. ఇవి యథాతథంగా పనిచేస్తాయి. వీటి సాయంతో ప్రజలు తమ ఇంటి నుంచే బ్యాంకింగ్ అవసరాలను సమర్థంగా, సురక్షితంగా నిర్వహించుకోగలుతారని ఆర్బీఐ వివరించింది.

మార్చి చివరి వారంలో సెలవులు ఇలా..

మార్చి 24: ఆదివారం సెలవు.

ఇవి కూడా చదవండి

మార్చి 25 (సోమవారం): హెూలీ.. ఈ సందర్భంగా త్రిపుర, మిజోరం, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోం, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, గోవా, ఛత్తీస్గఢ్ మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

మార్చి 26 (మంగళవారం): యయోసాంగ్ 2వ రోజు/హెూలీ.. ఈ సందర్భంగా ఒడిశా, మణిపూర్, బీహార్లలో బ్యాంకులు మూతపడతాయి.

మార్చి 27 (బుధవారం): హెూలీ.. బీహార్లో మాత్రమే బ్యాంకులకు సెలవు.

మార్చి 29 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే.. ఈ సందర్భంగా మిజోరం, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, గోవా, బీహార్, ఛత్తీస్ గఢ్ మేఘాలయలలో బ్యాంకులు మూతపడతాయి.

మార్చి 31: ఆదివారం

  • ఈ వారంలో ఇన్ని సెలవులున్న నేపథ్యంలో మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఆదివారం అయినప్పటికీ దేశంలోని 33 ఏజెన్సీ బ్యాంకులు పనిచేసేలా ఆర్బీఐ కొత్తగా ఆదేశాలిచ్చింది. వీటిల్లో ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. ఆ రోజున బ్యాంకులు పనిచేస్తాయన్న విషయాన్ని వినియోగదారులకు తెలిసేలా ప్రచారం కూడా నిర్వహించమని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..