Bank Holidays: ఆ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. వెల్లడించిన ఆర్బీఐ.. ఎక్కడెక్కడ అంటే..!

| Edited By: Subhash Goud

Jul 17, 2021 | 1:56 PM

Bank Holidays: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? అయితే ఈ విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి. పలు ప్రధాన నగరాల్లో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు..

Bank Holidays: ఆ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. వెల్లడించిన ఆర్బీఐ.. ఎక్కడెక్కడ అంటే..!
Follow us on

Bank Holidays: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? అయితే ఈ విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి. పలు ప్రధాన నగరాల్లో ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండటంతో వినియోగదారులు ముందుగానే గుర్తించి బ్యాంకు లావాదేవీలైమైనా ఉంటే చేసుకోవడం బెటర్‌. దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు రాబోయే ఐదు రోజుల పాటు మూసివేస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) శనివారం వెల్లడించింది. రిజర్వు బ్యాంకు క్యాలెండరు నోటిఫికేషన్ ప్రకారం జూలై 21వ తేదీన బ్యాంకులన్ని మూసి ఉంచుతారు. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన డెహ్రాడూన్ లో హరేలా పూజ సందర్భంగా బ్యాంకులను మూసివేయనున్నారు. యు టిరోట్ సింగ్ డే, ఖార్చి పూజల సందర్భంగా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా, మేఘాలయలోని షిల్లాంగ్ నగరాల్లో శనివారం (జూలై 17) బ్యాంకులు మూసివేశారు. అలాగే వారాంతమైన ఆదివారం (జూలై18) బ్యాంకులు పనిచేయవు.

ఇక సిక్కిం రాజధాని నగరమైన గ్యాంగ్ టక్ లో సోమవారం (జూలై 19) గురు రింపోచే సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మంగళవారం (జూలై 20) బక్రీద్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, తిరువనంతపురం నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్‌ బ్యాంక్‌. ఈదుల్ అదా పండుగ సందర్భంగా భారతదేశంలోని అన్ని నగరాల్లో బ్యాంకులు మూసి ఉంచనున్నట్లు వెల్లడించింది. అయితే ఐజాల్, కొచ్చి, తిరువనంతపురం, భువనేశ్వర్, గ్యాంగ్ టక్ లలో మాత్రం జూలై 21 న బ్యాంకులు పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

OnePlus TV: వినియోగదారులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన స్మార్ట్‌టీవీల ధరలు..రూ.7000 వరకు పెంపు

RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!