Education Loans: ప్రస్తుతం బ్యాంకులు హోమ్‌లోన్స్‌తో పాటు వ్యక్తిగత లోన్స్, విద్యా రుణాలను అందిస్తోంది. బ్యాంకులను బట్టి వివిధ రకాల వడ్డీ రేట్ల ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు మే నుండి పెంచడం పెంచడం కారణంగా విద్యా రుణాలు మరింత ప్రియమైపోయాయి. మొత్తంగా సెంట్రల్ బ్యాంక్ ఇప్పటివరకు కీలకమైన పాలసీ రేటును 140 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్‌బజార్.కామ్ డేటా ప్రకారం.. అనేక రుణదాతలు, ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ. 20 లక్షల విద్యా రుణంపై ఇప్పటికీ 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు ప్రస్తుతం 6.95 శాతం అత్యల్పంగా ఉంది. ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20 లక్షల రుణం కోసం సమానమైన నెలవారీ వాయిదా మొత్తం రూ.30,136. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 7.45 శాతం వడ్డీ రేటుతో చౌకైన రుణదాతల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈఎంఐ రూ. 30,627గా ఉంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విద్యా రుణాలపై 7.5 శాతంతో అందిస్తోంది. దీని ఈఎంఐ రూ.30,677గా ఉంది.
మరో రెండు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంక్ కూడా తమ విద్యార్థి కస్టమర్లకు అదే వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ఇక ఇండియన్ బ్యాంకు ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20 లక్షల విద్యా రుణంపై 7.9 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. రుణగ్రహీత రూ.31,073 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఇక కెనరా బ్యాంక్ రూ. 20 లక్షల విద్యా రుణంపై ఏడేళ్ల చెల్లింపు వ్యవధితో వడ్డీ 8.3 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుండగా, నెలవారీ ఈఎంఐ రూ.31,472గా ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విద్యా రుణాలపై 8.35 శాతం వడ్డీ రేటుతో నెలవారీ EMIలు రూ. 31,522 చెల్లించాలి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 8.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. EMI మొత్తం రూ. 31,572గా ఉంది. మరొక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ 8.65 శాతం, రూ. 31,824 EMIతో అందిస్తోంది. ఈ వివరాలన్ని బ్యాంకు వెబ్‌సైట్లు, బ్యాంక్‌బజార్.కామ్ డేటా ప్రకారం అందించడం జరుగుతుంది. ఆగస్టు 18, 2022 నాటికి సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్‌ల నుండి డేటా సేకరించబడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి