Banking News: ప్రతినెల బ్యాంకింగ్ రంగంలో అనేక నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా ఆధార్, పాన్ నమోదు, ఇతర నిబంధనలు ఉంటాయి. బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో మార్పులు, రుణాల ప్రాసెసింగ్ ఫీజుల్లో మార్పులు వంటివి చేస్తుంటాయి. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ (Canara Bank) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposit)పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకునే వారికి అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసే వారికి ఇకపై అధిక రాబడి పొందవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇక కెనరా బ్యాంకు తాజాగా ఎఫ్‌డీ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంకు వెల్లడించింది. ఏడాది కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేటు 5.1 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.15 శాతానికి ఎగబాకింది.
ఇక 2-3 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.2 శాతంగా ఉంది. ఇక 3 నుంచి 5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.45 శాతానికి పెరిగింది. 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.5 శాతానికి చేరింది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ కస్టమర్లతో పోలిస్తే 50 బేసిస్ పాయిట్ల వరకు అధిక వడ్డీ పొందవచ్చు. గృహ రుణం, వాహనాల రుణంపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ప్రయోజనం అందిస్తోంది. ఈ ప్రయోజనం మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది.
ఇవి కూడా చదవండి: