Bank Privatisation: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ.. లిస్ట్ ఫైనల్ అయినట్లేనా..!

|

Apr 15, 2021 | 12:21 PM

Bank Privatisation: కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నట్లు

Bank Privatisation: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ.. లిస్ట్ ఫైనల్ అయినట్లేనా..!
Banks Privatisation
Follow us on

Bank Privatisation: కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. మరికొన్ని ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ జరుగుతుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సైతం ప్రకటించారు. ఈ విషయంపై విపక్షాలు, పలు పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ జరుగుతుందని స్పష్టంచేసింది. దీనిలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉన్నతాధికారులు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే విషయంపై సమావేశాలు సైతం ప్రారంభమయ్యాయి.

మీడియా నివేదికల ప్రకారం.. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి బుధవారం (ఏప్రిల్ 14న) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఇందులో పలు ముఖ్యమైన బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం.. ప్రభుత్వం రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నారు. అయితే.. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. నాలుగు బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్ సూచించింది. ఈ నాలుగు పేర్లలో రెండు పేర్లను షార్ట్ లిస్ట్ చేయవలసి ఉంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.

అయితే వీటిలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది. అయితే నీతి ఆయోగ్ సూచించిన నాలుగు పేర్లల్లో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులను ప్రభుత్వం ప్రైవేటీకరించనుందని పేర్కొంటున్నారు. వాటినే ఫైనల్ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. దేశంలో ప్రస్తుతం 12 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. పెరుగుతున్న నిరర్థక ఆస్తులను (NPA) దృష్టిలో ఉంచుకుని బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: