Regional Rural Banks: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక గ్రామీణ బ్యాంకుల విలీనం..!

|

Nov 05, 2024 | 3:17 PM

ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో RRB చట్టం, 1976 కింద ఏర్పాటు చేశారు. ఈ చట్టం 2015లో సవరించారు. దీని ప్రకారం అటువంటి బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర..

Regional Rural Banks: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక గ్రామీణ బ్యాంకుల విలీనం..!
Follow us on

దేశంలో పలు బ్యాంకులు విలీనమవుతున్నాయి. ఖర్చులను నియంత్రించడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని పలు బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. తాజాగా గ్రామీణ బ్యాంకులను కూడా విలీనం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దశల వారీగా ఈ ప్రక్రియను చేపట్టగా, ఇప్పుడు నాలుగో దశ చేపట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ప్రక్రియతో గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)తో సంప్రదించి తదుపరి దీని కోసం బ్లూప్రింట్ తయారు చేస్తారు. నవంబర్ 20లోగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల అధిపతుల నుండి ఓపినియన్‌ కోరింది. ఇప్పటికే మూడు దశల విలీనం ద్వారా 2020-21 నాటికి అటువంటి సంస్థల సంఖ్య 196 నుండి 43కి తగ్గింది. ఇప్పుడు 28కి చేరనుంది.

ఇది కూడా చదవండి: Gold: ఈ భవనంలో వేల టన్నుల బంగారం.. 24 గంటలు కమాండోల మోహరింపు.. నిఘా నీడలో ఫోర్ట్ నాక్స్

ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 15 ఆర్‌ఆర్‌బీలు విలీనం కానున్నాయి. ఇందులో ఏపీకి చెందిన 4 బ్యాంకులు ఉండగా, యూపీ 3, పశ్చిమ బెంగాల్‌ 3, బీహార్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రెండేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ విలీన ప్రక్రియ అప్పులు, ఆస్తుల సర్దుబాటుకు లోబడి జరుగుతుంది. ఒకే రాష్ట్రం- ఒకే ఆర్‌ఆర్‌బీ వల్ల ఆయా బ్యాంకుల పనితీరు మెరుగవుతుందని చెబుతోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నాబార్డ్‌తో చర్చలు కొనసాగుతున్నాయని అధికారుల ద్వారా సమాచారం.

ఆర్‌ఆర్‌బీలో కేంద్రానికి 50 శాతం వాటా

ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో RRB చట్టం, 1976 కింద ఏర్పాటు చేశారు. ఈ చట్టం 2015లో సవరించారు. దీని ప్రకారం అటువంటి బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర బ్యాంకుల నుండి కాకుండా ఇతర వనరుల నుండి మూలధనాన్ని సేకరించేందుకు అనుమతించింది.

ఇది కూడా చదవండి: Gold Rate Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి