Bank Loan: ఈ బ్యాంకులో హోమ్‌ లోన్‌ తీసుకునే వారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ వడ్డీ, ఇతర ఫీజుల మినహాయింపు..!

Bank Loan: ప్రస్తుతం పండగ సీజన్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు కస్టమర్లకు భారీ ఆఫర్లను కల్పిస్తున్నాయి హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌..

Bank Loan: ఈ బ్యాంకులో హోమ్‌ లోన్‌ తీసుకునే వారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ వడ్డీ, ఇతర ఫీజుల మినహాయింపు..!

Updated on: Oct 24, 2021 | 9:18 AM

Bank Loan: ప్రస్తుతం పండగ సీజన్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు కస్టమర్లకు భారీ ఆఫర్లను కల్పిస్తున్నాయి హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌ ఇతర రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు రుణాలపై వడ్డీ శాతాన్ని తగ్గించాయి. ఇందులో భాగంగా సొంతింటి కల సాకారం చేసుకోవడానికి బ్యాంక్ నుంచి హోమ్ లోన్ పొందాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. పండుగ సీజన్‌లో మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తాజాగా గృహ రుణం తీసుకునే వారికి తీపికబురు అందించింది. పండుగ ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

తక్కువ వడ్డీకే రుణం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో గృహ రుణం తీసుకుంటే తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 6.6 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రూ.25 లక్షల వరకు పొందవచ్చు. వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంటుంది. అలాగే హోమ్ లోన్ తీసుకునే వారికి 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీల మినహాయింపు లభిస్తోంది. ఇలా బ్యాంకులు వడ్డీరేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజుల విషయాలలో తగ్గింపు ఇస్తుండటంతో వినియోగదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. పండగ సీజన్‌లో ఇలాంటి సదుపాయాలు మరెప్పుడు ఉండవు.

 

ఇవి కూడా చదవండి:

Dhanteras: ధన త్రయోదశి రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు..? పసిడితో పాటు ఇవి కూడా కొంటే మంచిదేనట..!

Sovereign Gold Bond scheme: అక్టోబర్‌ 25 నుంచి సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.. తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి16 లక్షలు.. పూర్తి వివరాలు..!