Car loans: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? బ్యాంకు రుణం పొందడం చాలా సులభం.!

ఆధునిక కాలంలో కారు కనీస అవసరంగా మారింది. కుటుంబంలో నలుగురు సభ్యులంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి పనినీ త్వరగా తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సొంత కారు ఉంటే పనులన్నింటినీ వేగంగా చేేసుకోవచ్చు. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు చేసుకోవడానికి వివిధ బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. వాటి వడ్డీరేట్లు, ఇతర నిబంధనలను తెలుసుకుందాం.

Car loans: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? బ్యాంకు రుణం పొందడం చాలా సులభం.!
Car Loans

Updated on: Apr 30, 2025 | 5:00 PM

కారు రుణానికి దరఖాస్తు చేసుకునేవారికి కొన్ని అర్హతలు ఉండాలను బ్యాంకులు నిర్దేశించాయి. ఇవి ఆయా బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా మారవచ్చు. దరఖాస్తుదారుడు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నెలకు కనీసం రూ.20 వేల ఆదాయం సంపాదిస్తూ ఉండాలి. ప్రస్తుత కంపెనీలో ఏడాదిగా పనిచేస్తూ ఉండాలి. స్వయం ఉపాధి లేదా జీతం పొందేవారు అర్హులు.

వడ్డీరేటు వివరాలు

కారు కొనుగోలు కోసం వివిధ బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. వాటి వడ్డీ రేటు 8.45 శాతం ప్రారంభమవుతున్నాయి. లోను కాలపరిమితి సుమారు ఎనిమిదేళ్లు ఉంటుంది. సులభ వాయిదాలలో వడ్డీతో కలిసి రుణాన్ని తీర్చేయవచ్చు. రుణదాతను బట్టి కారు ఆన్ రోడ్డు ఖర్చులో వంద శాతం రుణం పొందవచ్చు. స్థిర, ప్లోటింగ్ వడ్డీ రేటు విధానంలో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కారు లోన్ కు వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు, ఈఎంఐలు ఇలా ఉన్నాయి.

  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఏడేళ్ల కాలపరిమితికి కారు రుణం మంజూరు చేస్తారు. వడ్డీరేటు 9.10 నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐగా రూ.లక్షకు రూ.1,614 చొప్పున కట్టాలి.
  • హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 9.40 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుంది. ఈఎంఐగా రూ.లక్షకు రూ.1,629 చొప్పున చెల్లించాలి.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఫ్లోటింగ్ రుణాలకు రూ.1,584, స్థిర రుణాలకు రూ.1.634 నుంచి (రూ.లక్షకు) మొదలవుతుంది. వడ్డీరేటు ఫ్లోటింగ్ రుణాలకు 8.50 శాతం, స్థిర రుణాలకు 9.50 శాతం చొప్పున వసూలు చేస్తారు.
  • యాక్సిస్ బ్యాంకులో రూ.లక్షకు రూ.1.629 నుంచి ఈఎంఐ మొదలవుతుంది. ఏడాదికి 9.40 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
  • బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఏడాదికి 8.75 శాతం వడ్డీ ఉంటుంది. లక్ష రూపాయలకు ఈఎంఐగా నెలకు రూ.1.596 చెల్లించాలి.
  • కెనరా బ్యాంకులో 8.45, ఐసీఐసీఐ బ్యాంకులో 9.10, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 8.60, సౌత్ ఇండియన్ బ్యాంకులో 8.75, యూనియన్ బ్యాంకులో 8.45 శాతం నుంచి కారు రుణాల వడ్డీరేటు మొదలవుతున్నాయి.