భారత్లో నిన్న మొన్నటి వరకు సంక్రాంతి సందర్భంగా అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. దాదాపు మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి ఈ వారంలో తలెత్తనుంది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే, చివరి శనివారం, ఆదివారం సందర్భంగా మళ్ళీ మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందున ఉత్తర ప్రదేశ్ లోని బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా ఇంఫాల్ లో కూడా 22న బ్యాంకులు మూసివేయనున్నారు. ఈ వారంలో ఏ పని జరగాలన్నా జనవరి 23, 24 తేదీల్లో ముగించుకోవాలి. జనవరి 25న మహ్మద్ హజ్రత్ అలీ జన్మదినం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
దీంతో మణిపుర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో బ్యాంకులను ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. ఆ తరువాత జనవరి 26న రిపబ్లిక్ డే కారణంగా కూడా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 27 నెలలో చివరి శనివారం కావడంతో సెలవు ఉంది. ఇక జనవరి 28 ఆదివారం జనరల్ హాలిడే. దీంతో ఈ వారంలో కొన్ని రాష్ట్రాల్లో రెండు రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో మూడు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. అయితే అప్లికేషన్లకు సంబంధించిన సేవలు మాత్రమే నిలిచిపోనున్నట్లు తెలిపింది ఆర్బీఐ. మిగిలిన యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలన్నీ యధావిధిగా కొనసాగనున్నట్లు ప్రకటించింది. సెలవు దినాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు రచించుకోవాలని సూచిందింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..