Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..

|

Sep 14, 2022 | 4:47 PM

Five Days Bank Holidays: చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతూనే ఉంటారు. వివిధ కంపెనీలతో పాటు ఇతరులు కూడా బ్యాంకు పనుల కోసం వారివారి బ్రాంచులను..

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..
Bank Holidays
Follow us on

Five Days Bank Holidays: చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతూనే ఉంటారు. వివిధ కంపెనీలతో పాటు ఇతరులు కూడా బ్యాంకు పనుల కోసం వారివారి బ్రాంచులను సందర్శిస్తుంటారు. అయితే బ్యాంకు పనులున్న వారు ముందుగా ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పటికే సెప్టెంబర్‌ నెల సంగ రోజులు గడిచిపోయింది. ఇంకో 15 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా గమనించాలి. సెప్టెంబర్‌ నెలలో మిగిలిన 15 రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రతి నెల బ్యాంకుల సెలవులను ప్రకటిస్తుంటుంది. దీంతో బ్యాంకు పనులున్నవారు సెలవులను గమనించి ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. ఈ 15 రోజుల్లో కేవలం 9 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. ఈనెలలో మొత్తం13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇందులో 8 రోజులు పూర్తయ్యాయి. ఇంకో 5 రోజులు ఉన్నాయి. మరి ఈ ఐదు రోజులు ఏయే తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.
సెప్టెంబర్‌ 15 తర్వాత బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు:

18 సెప్టెంబర్ – ఆదివారం
21 సెప్టెంబర్ – శ్రీ నారాయణ గురు సమాధి దివస్
24 సెప్టెంబర్ – నాలుగో శనివారం
25 సెప్టెంబర్ – ఆదివారం
26 సెప్టెంబర్ – నవరాత్రి స్థాపన

వినియోగదారులు ఈ ఐదు రోజుల సెలవులను గమనించి బ్యాంకు పనులపై ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి