చాలా మంది వినియోగదారులు ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. లావాదేవీలు, చెక్స్, ఇతర పనుల కోసం బ్యాంకులను సందర్శిస్తుంటారు. అయితే సెప్టెంబర్ 7ఈ రోజు గణేష్ చతుర్థి. ఈ పండగను దేశ మంతటా ఘనంగా జరుపుకొంటారు. పండగ కారణంగా బ్యాంకులు బంద్ ఉంటాయా? లేదా అనే అనుమానం కలుగుతుంటుంది. దీని సమాధానం అవుననే సమాధానం వస్తుంది. ఈ రోజు బ్యాంకులకు సెలవు. దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 8న ఆదివారం. ఇలా బ్యాంకులు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో సహా భారతదేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన జాబితా ఈ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు:
ఇదిలా ఉండగా, బ్యాంకులకు సెలవు రోజుల్లో ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాటికి ఎలాంటి అంతరాయం ఉండదు.
నగదు అత్యవసర పరిస్థితుల కోసం అన్ని బ్యాంకులు వారాంతపు లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా తమ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్‌లను నిర్వహిస్తాయి. బ్యాంకులు మూసి ఉన్న సమయాల్లో ఆన్‌లైన్ సర్వీసులు కొనసాగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి