ఇందుకోసం ప్రభుత్వం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి తొలిసారిగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాలను తెలిపారు. ఆన్ లైన్ గేమ్స్ లో మొదటిది బెట్టింగ్‌తో కూడిన గేమ్స్ , రెండవది, వినియోగదారుకు హాని కలిగించేవి, మూడవది, వ్యాసనపరులుగా మార్చే గేమ్స్ ఇలా మూడురకాల కేటగిరీలుగా విభజించారు. ఆటలో ఈ కేటగిరీలు ఏవైనా కనిపిస్తే, అవి నిషేధానికి గురవుతాయి. నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత మూడు నెలల్లో స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
ఆన్‌లైన్ గేమ్‌లను ఉపయోగించి యువకులను చట్టవిరుద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న రాకెట్‌ను ఘజియాబాద్ పోలీసులు ఇటీవల ఛేదించిన నేపథ్యంలో కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లపై కేంద్రం చర్యలు చేపట్టింది. అలాంటి గేమ్‌లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది. బద్దో అలియాస్ షానవాజ్ ఖాన్ ద్వారా ప్రభావితమై తన కొడుకు ఇస్లాం మతంలోకి మారాడని ఘజియాబాద్‌లోని ఓ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా మత మార్పిడులు జరుగుతున్నాయన్న అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఇలాంటి గేమ్‌లను నిషేధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తోందని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాన్, ఘజియాబాద్‌లోని ఒక మసీదు మతాధికారిపై ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి