Bajaj Pulsar: పల్సర్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. కొత్త లుక్‌తో మరో బైక్‌ వచ్చేస్తోంది.. టీజర్ రిలిజ్

|

Oct 23, 2021 | 12:37 PM

Bajaj Pulsar: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ బైక్ కొత్త బజాజ్..

Bajaj Pulsar: పల్సర్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. కొత్త లుక్‌తో మరో బైక్‌ వచ్చేస్తోంది.. టీజర్ రిలిజ్
Follow us on

Bajaj Pulsar: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ బైక్ కొత్త బజాజ్ పల్సర్ 250 సిసి టీజర్‌ను విడుదల చేసింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ బైక్‌ను 28 అక్టోబర్ 2021న మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే పల్సర్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బైక్ కోసం టీజర్‌లో ఇది ఎన్నడూ లేనంత పెద్ద పల్సర్ బైక్ అని కంపెనీ పేర్కొంది.

అత్యాధునిక టెక్నాలజీతో..

ఈ బైక్‌ టీజర్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. మునుపటి పల్సర్ కంటే సైజు కూడా పెద్దదిగా కనిపిస్తుంది. బైక్ హెడ్ ల్యాంప్‌లు , టెయిల్ ల్యాంప్‌లు కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. వెనుక సీటు ఎత్తు కూడా సరిపోతుంది. చాలా సొగసైన లుక్ , శక్తివంతమైన 250 సీసీ ఇంజిన్ కలిగి ఉన్న ఈ బైక్ ఈ ఫెస్టివల్ మార్కెట్లో కొట్టుకుంటుంది. బజాజ్ ఆటో తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కొత్త బైక్ టీజర్‌ను విడుదల చేసింది.

పల్సర్ సిరీస్ బైకులు

బజాజ్ ఆటో పల్సర్ సిరీస్‌లో అనేక మోడళ్లను విక్రయిస్తుంది. వీటిలో మొత్తం ఎనిమిది మోడల్స్ 125 సిసి నుంచి 220 సిసి ఇంజిన్లలో విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో పల్సర్ 125 సీసీ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,472 కాగా, 220సీసీ లో బజాజ్, పల్సర్‌ 220ఎఫ్‌ మోడల్ ప్రారంభ ధర రూ .1,33,907. అదేవిధంగా, పల్సర్‌ ఆర్‌ఎస్‌200 మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1,63,168 గా నిర్ణయించారు.

ఇవీ కూడా చదవండి:

Petrol Diesel Prices Today: బాదుడే.. బాదుడే.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..!

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి16 లక్షలు.. పూర్తి వివరాలు..!