Bajaj freedom 125: ఆ బజాజ్ బండిపై బంపర్ ఆఫర్.. నమ్మలేని డిస్కౌంట్ ఇదే..!

భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ అంటే బజాజ్ బైక్స్ టక్కున గుర్తుకు వస్తాయి. మధ్యతరగతి ప్రజలను ఈ బైక్స్ ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇటీవల బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్‌జీ బైక్‌ను లాంచ్ చేసింది. తాజాగా ఆ బైక్‌పై నమ్మలేని తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ముఖ్యంగా సేల్స్ పెంచుకోవడమే కాక సీఎన్‌జీ బైక్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ ఆఫర్ ఇచ్చింది.

Bajaj freedom 125: ఆ బజాజ్ బండిపై బంపర్ ఆఫర్.. నమ్మలేని డిస్కౌంట్ ఇదే..!
Bajaj freedom 125

Updated on: Jun 21, 2025 | 4:38 PM

బజాజ్ ఆటో తన ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ దేశంలో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మోటార్ సైకిల్లో 125 సీసీ సాంప్రదాయ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అంతే కాక సీటు కింద ఉన్న సీఎన్‌జీ ట్యాంక్‌తో వస్తుంది. రెండు కిలోల సీఎన్‌జీ ట్యాంక్ 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో కలిపి ఇతర 125 సీసీ మోడళ్లతో పోలిస్తే కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంజిన్ 9.4 బీహెచ్‌పీ పవర్, 9.7 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రీడమ్ 125 సాంప్రదాయ 125 సీసీ పెట్రోల్ మోటార్ సైకిళ్లతో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 50 శాతం వరకు తగ్గిస్తుంది. సీఎన్‌జీతో పని చేసేటప్పుడు మైలేజ్ 102 కిమీ ఇస్తుంది. అలాగే పెట్రోల్‌ను ఉపయోగించి వినియోగిస్తే 64 కిమీ మైలేజ్ ఇస్తుంది. 

ఫ్రీడమ్ 125 సీఎన్‌జీతో మాత్రమే 200 కిమీ వరకు ప్రయాణించవచ్చు. పెట్రోల్ ట్యాంక్ అదనంగా 130 కిమీని అందిస్తుందని ఫలితంగా మొత్తం 330 కిమీ పరిధి లభిస్తుందని బజాజ్ పేర్కొంది. తాజాగా ఈ బైక్‌పై బజాజ్ కంపెనీ  5,000 తగ్గింపును ప్రకటించింది. ఈ సమాచారాన్న కంపెనీ తన సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ధర తగ్గింపు మోటార్ సైకిల్‌కు సంబంధించిన బేస్ వేరియంట్ అయిన ఎన్‌జీ04 డ్రమ్ వేరియంట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది శాశ్వత ధర తగ్గింపు అని బజాజ్ ప్రకటించలేదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత కంపెనీ ఈ ఆఫర్‌ను తొలగించే అవకాశం ఉంది. 

బజాజ్ ఫ్రీడమ్ 125 దాని డిజైన్ అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ 125 సీసీ సీఎన్‌జీ మోటార్ సైకిల్ క్షితిజ సమాంతరంగా ఉంచిన ఇంజిన్‌తో వస్తుంది. అలాగే సీటు కింద ఉన్న సీఎన్జీ ట్యాంక్‌ను రక్షించే ట్రేల్లిస్ ఫ్రేమ్‌తో వస్తుంది. అలాగే ద్వి-ఇంధన సామర్థ్యం బైక్ రెండు రకాల ఇంధనాల పై పనిచేయడానికి అనుమతిస్తుంది. వీటిలో 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, రిజర్వ్ ఉపయోగం కోసం 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో వస్తుంది. 147.8 కిలోల (కర్బ్) బరువుతో వచ్చే ఈ బైక్ ఇతర 125 సీసీ మోడళ్లతో పోలిస్తే కొంచెం బరువుగా ఉంటుంది.  ఫీచర్ల విషయానికొస్తే, బజాజ్ ఫ్రీడమ్ 125 లో ఎల్ఈడీ హెర్ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోలింక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా టాప్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి