Azim Premji: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని ఈ – సిటీలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న విప్రో కన్జ్యూమర్ కేర్(Wipro consumer care) ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభోత్సావానికి విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో కొత్తగా కంపెనీలను నెలకొల్పాలనుకునే వారికి ఇక్కడి ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతంతో పాటు పాజిటివ్ దృక్పథంతో ఆహ్వానిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెరీవెరీ ఛార్మింగ్ అని ప్రేమ్‌జీ ప్రశంసించారు. రానున్న కాలంలో తెలంగాణలో తన సంస్థ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీల రాకతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కంపెనీ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అదృష్టమని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. విప్రో సంస్థ రూ.300 కోట్లతో మహేశ్వరంలో ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభిస్తోందని.. అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించటం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడుల విధానాలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. వాటి వల్ల 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. తెలంగాణ యువతు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వివరించారు. కంపెనీల నెలకొల్పడం వల్ల ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
Live: Addressing the gathering at the @Wipro factory Inauguration Ceremony in Maheshwaram, Hyderabad https://t.co/auiLpbQ01p
— KTR (@KTRTRS) April 5, 2022
ఇవీ చదవండి..
ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Investments: నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తే.. గడువు ముగిసేసరికి లక్షల ఆదాయం పొందొచ్చు..