D-Mart: బంపర్ లాభాలను నమోదు చేసిన అవెన్యూ సూపర్ మార్ట్స్.. పెరిగిన స్టోర్ల సంఖ్య..

|

May 15, 2022 | 4:09 PM

D-Mart: ద్రవ్యోల్బం, ఆర్థిక ఒడిదొడుకులు ఉన్న సమయంలోనూ డీమార్ట్ సంస్థ బంపర్ లాభాలను నమోదు చేసింది. డీమార్ట్‌ పేరుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లాభాలను ఆర్జించింది.

D-Mart: బంపర్ లాభాలను నమోదు చేసిన అవెన్యూ సూపర్ మార్ట్స్.. పెరిగిన స్టోర్ల సంఖ్య..
Dmart
Follow us on

D-Mart: ద్రవ్యోల్బం, ఆర్థిక ఒడిదొడుకులు ఉన్న సమయంలోనూ డీమార్ట్ సంస్థ బంపర్ లాభాలను నమోదు చేసింది. డీమార్ట్‌ పేరుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదికన రూ.426.75 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.413.87 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ ప్రాతిపదికన పోలిస్తే కంపెనీ లాభం 3.11 శాతం పెరిగింది. వ్యాపార కార్యకలాపాల ద్వారా ఆదాయం 18.55 శాతం పెరిగి రూ.8,786.45 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు 18.71 శాతం వృద్ధితో రూ.8,210.13 కోట్లకు పెరిగాయి. కిందటేడాది ఇదే సమయంలో ఇవి రూ.6,916.24 కోట్లుగా ఉన్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరానికి అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఏకీకృత నికర లాభం 35.74 శాతం వృద్ధితో రూ.1,492.40 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 28.3 శాతం పెరిగి రూ.30,976.27 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం, ఆదాయం వరుసగా రూ.1,099.43 కోట్లు, రూ.24,143.06 కోట్లుగా ఉన్నాయి. 2021-22లో కొత్తగా 50 రిటైల్ స్టోర్లను కంపెనీ తెరిచింది. దీంతో మెుత్తం స్టోర్ల సంఖ్య 248కి పెరిగిందని సంస్థ వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

KSI Crypto: కోట్లు పోగొట్టుకున్న యూట్యూబర్.. పెట్టుబడిని ఆవిరి చేసిన ఆ క్రిప్టో కాయిన్.. జ్ఞానోదయమైందంటూ..

Property Dispute: మహిళా న్యాయవాదిపై నడిరోడ్డుపై దాడి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..