AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: కొత్త 7 సీటర్‌ను కేవలం రూ.5.65 లక్షలకే.. తక్కువ ధరలో సూపర్ SUV..!

Auto News: భారత మార్కెట్లో ఈ SUV రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, కియా కేరెన్స్ వంటి వాటి నుండి పోటీని ఎదుర్కొంటుంది. అయితే, తక్కువ ధరలో 7-సీటర్ వాహనం కోసం చూస్తున్న వినియోగదారులకు నిస్సాన్ గ్రావైట్ ఒక మంచి..

Auto News: కొత్త 7 సీటర్‌ను కేవలం రూ.5.65 లక్షలకే.. తక్కువ ధరలో సూపర్ SUV..!
Nissan Gravite
Subhash Goud
|

Updated on: May 12, 2026 | 6:13 PM

Share

Auto News: జపాన్‌కు చెందిన నిస్సాన్ సంస్థ భారతదేశంలో “నిస్సాన్ గ్రావైట్” అనే కొత్త 7 సీటర్ SUVని విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ ధరకే మరిన్ని ఫీచర్లను అందించాలనే లక్ష్యంతో ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.65 లక్షల నుండి మొదలవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ SUVని కుటుంబ వినియోగానికి, సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించారు.

నిస్సాన్ గ్రావిటీ ఎస్‌యూవీ తన ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్లు, స్పోర్టీ లుక్‌తో యువత దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారు లోపలి భాగంలో 7 మందికి సౌకర్యవంతమైన సీటింగ్ ఉండటంతో పాటు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price: పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.31 వేల వరకు తగ్గిన బంగారం ధర..!

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం.. ఇంజన్ విభాగంలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించనున్నారు. ఇది మంచి మైలేజీతో పాటు శక్తివంతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో ఇది నగరం, హైవే డ్రైవింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. భద్రతా ఫీచర్లలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

భారత మార్కెట్లో ఈ SUV రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, కియా కేరెన్స్ వంటి వాటి నుండి పోటీని ఎదుర్కొంటుంది. అయితే, తక్కువ ధరలో 7-సీటర్ వాహనం కోసం చూస్తున్న వినియోగదారులకు నిస్సాన్ గ్రావైట్ ఒక మంచి ఎంపిక కాగలదని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా భారతదేశంలో SUV, MPV విభాగాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నిస్సాన్ ఈ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారును ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ధర నిర్ణయించినట్లు చెబుతున్నారు. కంపెనీ త్వరలోనే బుకింగ్, డెలివరీ వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us