సాధారణంగా ఆర్థిక అత్యవసర సమయంలో ఎక్కువ మంది పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే పర్సనల్ లోన్లు అనేవి ఎక్కువగా ఉద్యోగస్తులకే బ్యాంకులు మంజూరు చేస్తాయి. వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు పర్సనల్ లోన్లు ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాగే రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు అనేవి క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో బంగారాన్ని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి బంగారు రుణాన్ని తీసుకుంటే తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ఏడాది చాలా వరకు బ్యాంకులు బంగారు రుణాలపై వడ్డీ రేట్లను సవరించాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తే కొన్ని బ్యాంకులు సవరించాయి. ముఖ్యంగా మరో 45 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రుణాల విషయంలో బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను గురించి తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి