Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు ఏవో తెలుసుకోండి..!

|

May 21, 2021 | 7:37 PM

Bank Charges: ప్రతీ కస్టమర్‌ నుంచి బ్యాంకులు కొన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. ఆ ఛార్జీల వివరాలన్నీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. అందుకే కనీసం మూడు నెలల..

Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు ఏవో తెలుసుకోండి..!
Follow us on

Bank Charges: ప్రతీ కస్టమర్‌ నుంచి బ్యాంకులు కొన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. ఆ ఛార్జీల వివరాలన్నీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. అందుకే కనీసం మూడు నెలలకోసారైనా బ్యాంకు అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ను చెక్‌ చేస్తే ఆ ఛార్జీలు ఏమిటో తెలిసిపోతాయి. సాధారణంగా ఛార్జీలకు సంబంధించిన వివరాలు మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో రావు. కాబట్టి ఆ ఛార్జీలు ఏమిటో చాలా మందికి తెలియవు. మరి ఆ ఛార్జీలు ఏమిటో తెలుసుకోండి.

క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌ (Cash Transactions):

మీ డబ్బుతో మీరు ట్రాన్సాక్షన్స్‌ చేస్తారు. అయినా క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌ లిమిట్‌ అనేది ఉంటుంది. ఆ లిమిట్‌ దాటినట్లయితే బ్యాంకులు క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ ఫీజు వసూలు చేస్తుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాదు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకులో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్ లేదా నెలకు రూ.2 లక్షల ట్రాన్సాక్షన్స్ ఉచితం. అది దాటినట్లయితే మీరు డ్రా చేసే ప్రతీ రూ.1,000 కి రూ.10 లేదా రూ.150 ఛార్జీ చెల్లించాలి.

ఏటీఎం విత్‌డ్రాయల్‌ ఛార్జీలు (ATM Withdrawal Charges):

మీ ఖాతాలో ఉన్న డబ్బును మీరు ఏటీఎం ద్వారా డ్రా చేసినా ఛార్జీలను వసూలు చేస్తుంది బ్యాంకు. మీకు ఉన్న ఉచిత లావాదేవీల పరిమితి దాటినట్లయితే తర్వాత ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు ప్రతీ లావాదేవి రూ.20 నుంచి రూ.50 వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అన్ని బ్యాంకు ఒకేలా విధించవు. వేర్వేరు ఛార్జీలు ఉంటాయి.

ఏటీఎం ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ ఛార్జీలు (Failed ATM Transaction)

మీ అకౌంట్‌లో డబ్బులు లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ రూ.20+జీఎస్‌టీ వసూలు చేస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు రూ.25+జీఎస్‌టీ వసూలు చేస్తున్నాయి.

మినిమమ్‌ బ్యాలెన్స్‌ (Minimum Balance):

ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనలు అందరికి తెలిసిందే. అకౌంట్‌లో ఉండాల్సినంత బ్యాలెన్స్ లేకపోతే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూరల్, అర్బన్, మెట్రో నగరాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

డెబిట్‌ కార్డు ఛార్జీలు (Debit Card Charges):

పొరపాటున మీ ఏటీఎం కార్డు పోయినా.. దాని స్థానంలో కొత్త కార్డు కార్డు కావాలంటే రూ.50 నుంచి రూ.500 వరకు ఛార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఖాతా ఓపెన్‌ చేసినప్పుడు మొదటిసారి మాత్రమే ఏటీఎం కార్డు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత కార్డు పోతే కొత్త కార్డు కావాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు.

చెక్‌ (Cheque):

మీరు ఎవరికైనా చెక్ ఇచ్చారంటే.. చెక్ క్లియరెన్స్ ఛార్జీలు ఉంటాయి. ఒక చెక్ క్లియర్ కావడానికి రూ.150 వరకు ఛార్జీలు చేస్తాయి బ్యాంకులు. అయితే రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువ ఉన్న చెక్స్‌కి మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.1,00,000 లోపు చెక్స్‌కి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ఒక వేళ చెక్ బౌన్స్ అయినా ఛార్జీలు తప్పవు.

డాక్యుమెంట్‌ ఛార్జీలు (Documentation Charges):

బ్యాంకు నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ పొందాలంటే ఛార్జీలు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఏడాదికి ఒకసారి యాన్యువల్ స్టేట్‌మెంట్‌ను ఉచితంగా ఇస్తాయి. డూప్లికేట్ అకౌంట్ స్టేట్‌మెంట్ కావాలంటే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాలి. సిగ్నేచర్ వెరిఫికేషన్ లాంటి వాటికీ ఛార్జీలు ఉంటాయి.

ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు (SMS Charges):

మీ ఖాతాలో జరిగే ట్రాన్సాక్షన్స్‌లపై ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయా? అయితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎస్ఎంఎస్‌ అలర్ట్స్ పంపడానికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటాయి.

ఐఎంపీఎస్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ (IMPS Money Transfer):

నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బులు పంపితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు మీరు పంపే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఐఎంపీఎస్ ఛార్జీలు రూ.1 నుంచి రూ.25 మధ్య ఉంటాయి.

ట్రాన్సాక్షన్‌ ఫెయిల్యూర్‌ ఛార్జీలు (Failed ECS Transaction Charges):

మీరు పేమెంట్స్, ఈఎంఐల కోసం ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ (ECS) ఉపయోగిస్తున్నట్లయితే, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్‌కు ఛార్జీలు ఉంటాయి. అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఆ సమయంలో ఛార్జీలు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర ఛార్జీలు (Other Charges):

ఇక ఈ ఛార్జీలే కాకుండా బ్యాంకులు అనేక రకమైన ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. ఖాతా పూర్తిగా నిలిపివేసేందుకు, కొత్త చెక్‌ బుక్‌, ఔట్‌ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, డిమాండ్ డ్రాఫ్ట్స్, రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్, పిన్ రీజెనరేషన్, లాకర్ రెంట్ లాంటి ఛార్జీలు కూడా ఉంటాయి.

అందుకే ఇలాంటి ఛార్జీలు ఎక్కువ మందికి తెలియకపోయినా.. తెలుసుకుంటే మంచిది. లేకుండా దేనికి ఎంత ఛార్జీలు కట్‌ చేస్తున్నారో తెలియవు. మన ఖాతాలో డబ్బులు కట్‌ కాగానే మనం టెన్షన్‌కు గురవుతుంటాము. ఎందుకు కట్‌ అయ్యాయే కూడా తెలియవు. అందుకే అప్పుడప్పుడు బ్యాంకు స్టేట్‌ మెంట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి. అప్పుడే ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నారనే విషయం తెలుస్తుంది.