Ather Rizta: ఆసక్తి పెంచుతున్న ఏథర్‌ రిజ్తా టీజర్లు.. రిలీజ్‌ ఎప్పుడంటే..?

తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్‌ తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ లేటెస్ట్‌ ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్‌ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏథర్ 450 శ్రేణికి పూర్తి భిన్నంగా ఉండేలా ఈ సరికొత్త స్కూటర్‌ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏథర్‌ రిజ్తా పేరుతో రిలీజ్‌ చేస్తున్న ఈ ఈవీ స్కూటర్‌ కుటుంబ స్నేహపూర్వక స్కూటర్‌గా పరిగణిస్తున్నారు.

Ather Rizta: ఆసక్తి పెంచుతున్న ఏథర్‌ రిజ్తా టీజర్లు.. రిలీజ్‌ ఎప్పుడంటే..?
Ather Rizta

Updated on: Feb 04, 2024 | 8:45 PM

భారతదేశంలో ఈవీ స్కూటర్లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. పెరిగిన పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఈవీ స్కూటర్లను ఎంచుకోవడంతో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ స్కూటర్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్‌ తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ లేటెస్ట్‌ ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్‌ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏథర్ 450 శ్రేణికి పూర్తి భిన్నంగా ఉండేలా ఈ సరికొత్త స్కూటర్‌ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏథర్‌ రిజ్తా పేరుతో రిలీజ్‌ చేస్తున్న ఈ ఈవీ స్కూటర్‌ కుటుంబ స్నేహపూర్వక స్కూటర్‌గా పరిగణిస్తున్నారు. కాబట్టి ఏతర్‌ రిజ్తా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఏథర్‌ స్కూటర్ల గురించి ఎప్పటికప్పుడ ఆ కంపెనీ సీఈఓ ట్విట్లర్‌ ఎక్స్‌ ద్వారా టీజర్లను రిలీజ్‌ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు. ఇటీవల కూడా ఏథర్‌ రిజ్తా గురించి ఓ టీజర్‌ రిలీజ్‌ చేశాడు. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల సీట్లు చిన్నగా వస్తున్న ప్రస్తుత మోడల్స్‌లో పెద్ద సైజ్‌ సీటుతో ఏథర్‌ రిజ్తా వస్తుందని టీజర్‌ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ స్కూటర్‌ కచ్చితంగా చిన్న కుటుంబాలకు అనువుగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్కూటర్ ప్రస్తుత ఏథర్ 450ల నుండి పూర్తిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని స్పై షాట్‌ల ద్వారా వెల్లడైంది.

విశాలమైన  ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌తో వచ్చే ఏథర్‌ రిజ్తా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందజేస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 7.0-అంగుళాల ‘డీప్‌వ్యూ’ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో వస్తుందని పేర్కొంటున్నారు. ఈ ఫీచర్‌ను మొదట 450ఎస్‌లో పరిచయం చేశారు. ఏథర్ రిజ్తా ఈ ఏడాది జూన్‌లో జరిగే ఏథర్ కమ్యూనిటీ డే సెలబ్రేషన్ 2024లో ఆవిష్కరించే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి