Ather Rizta: ఏథర్ రిజ్టా రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..! సోషల్ మీడియాలో వైరల్‌గా రిజ్టా వాటర్ డ్రైవింగ్ వీడియో

|

Mar 23, 2024 | 4:15 PM

రిజ్టా పేరుతో రిలీజ్ చేసే ఈ-స్కూటర్ ఏప్రిల్ 6న ఏథర్ కమ్యూనిటీ డేలో అధికారికంగా ఆవిష్కరిస్తారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఏథర్ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చాలా వివరాలను వెల్లడించింది. కంపెనీ భాగస్వామ్యం చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ముఖ్యంగా ఏథర్ రిజ్టా బ్యాటరీ ప్యాక్ ఐపీ 67 రేటింగ్‌తో వస్తుంది.

Ather Rizta: ఏథర్ రిజ్టా రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..! సోషల్ మీడియాలో వైరల్‌గా రిజ్టా వాటర్ డ్రైవింగ్ వీడియో
Ather Rizta
Follow us on

ఇటీవల భారతదేశంలో పెరుగుతున్న ఈవీ వాహనాల డిమాండ్ నేపథ్యంలో ఏథర్ ఎనర్జీ భారతీయ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తుంది. రిజ్టా పేరుతో రిలీజ్ చేసే ఈ-స్కూటర్ ఏప్రిల్ 6న ఏథర్ కమ్యూనిటీ డేలో అధికారికంగా ఆవిష్కరిస్తారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఏథర్ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చాలా వివరాలను వెల్లడించింది. కంపెనీ భాగస్వామ్యం చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ముఖ్యంగా ఏథర్ రిజ్టా బ్యాటరీ ప్యాక్ ఐపీ 67 రేటింగ్‌తో వస్తుంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకరాం రిజ్టా 400 మి.మీ లోతైన నీటి గుండా వెళుతుంది. ముఖ్యంగా నీటిలో వెళ్లినా ఈ స్కూటర్‌కు ఏమీ కాదని తెలియజేయడానికి రిజ్టా స్కూటర్‌తో పరీక్ష చేసింది. అయితే టీజర్ వీడియోలో కొన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. 

బెంగుళూరు ఆధారిత స్టార్టప్ ఏథర్ రిజ్టాకు సంబంధించిన మార్కెటింగ్ కార్యకలాపాలలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంది. ఏథర్ విడుదల చేసిన తాజా వీడియోలో రిజ్టా 400 మిల్లీ మీట్లర లోతైన నీటి కందకం గుండా వెళుతున్నట్లు ఉంది. రిజ్టాకు సంబంధించిన బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్, ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ కాంపోనెంట్‌లకు ఐపీ 67 రేటింగ్‌ను సపోర్ట్ చేస్తుందని వినియోగదారులకు నమ్మకం కలిగించేలా ఈ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా గుర్తించవచ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏథర్ 450ఎక్స్‌లోని యూనిట్‌తో సమానంగా కనిపిస్తుంది. వీడియోలో వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ స్పీడోమీటర్‌కు సంబంధించిన కొన్ని వివరాలను సులభంగా కనిపిస్తుంది. అంటే బ్యాటరీ ప్యాక్‌తో పాటు, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 450 ఎక్స్ మాదిరిగా ఉందని గుర్తించవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, సంగీతం వంటి ఇతర అవసరమైన ఫీచర్‌లు రిజ్టాలో ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏథర్ రిజ్టాకు సంబంధించిన బ్యాటరీ ప్యాక్‌ను 40 అడుగుల ఎత్తు నుంచి పరీక్ష చేశారు. ఏథర్ రిజ్టా పనితీరు-కేంద్రీకృత కొనుగోలుదారుల కంటే ఆచరణాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న మరింత అధునాతన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ కుటుంబ స్నేహపూర్వక ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అనుగుణంగా ఈ స్కూటర్ డిజైన్ ఉంది. అందువల్ల ఈ స్కూటర్ పట్టణ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..