Ather Rizta: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా.. 450 ఎస్ కంటే మెరుగైన ఫీచర్లు

|

Apr 16, 2024 | 9:00 AM

ముఖ్యంగా ఫీచర్ల విషయంలో ఏథర్ రిజ్టాలో ఎల్‌సీడీ కన్సోల్, మిగిలిన రెండింటిలో టీఎఫ్‌టీలు ఉన్నాయి. అన్ని ఏథర్ మోడల్స్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే ఏథర్ రిజ్టాలో ఏథర్ సక్సెస్ మోడల్ అయిన 450 ఎస్ కంటే మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

Ather Rizta: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా.. 450 ఎస్ కంటే మెరుగైన ఫీచర్లు
Ather Rizta Family Scooter
Follow us on

ఏథర్ ఇటీవల  భారతదేశంలో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఇతర ఏథర్ ఈవీలతో పోల్చుకుంటే రిజ్జా ప్రత్యేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫీచర్ల విషయంలో ఏథర్ రిజ్టాలో ఎల్‌సీడీ కన్సోల్, మిగిలిన రెండింటిలో టీఎఫ్‌టీలు ఉన్నాయి. అన్ని ఏథర్ మోడల్స్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే ఏథర్ రిజ్టాలో ఏథర్ సక్సెస్ మోడల్ అయిన 450 ఎస్ కంటే మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా ఫీచర్లతో పాటు ఇతర వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

ఏథర్ రిజ్టా డిజైన్ పరంగా ఇతర స్కూటర్లకంటే మెరుగ్గా ఉంది. ముఖ్యంగా 450 డిజైన్ కంటే ఆధునికంగా ఉంది. ముఖ్యంగా ఏథర్ రిజ్టాలో స్కిన్నీ, గ్రిప్పీ టైర్‌లతో కూడిన టైర్లు రైడర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రిజ్టాలో వచ్చే వార్ప్ మోడ్‌ వల్ల స్పోర్టీ ఫీచర్లు వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్లతో కొత్త ఈవీ స్కూటర్లను కొందామనుకునే రిజ్టా మంచి ఎంపికగా ఉంటుంది. ఏథర్ రిజ్టా అధునాతన సస్పెన్షన్ సిస్టమ్‌తో వస్తుంది. 

ఏథర్ రిజ్టా చాలా భిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది.  థీమ్ పూర్తి పనితీరు, సౌలభ్యం విషయంలో ఆకట్టుకుంటుంది. ఇది కేవలం రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. జిప్, స్మార్ట్‌ఈకో మోడ్స్‌లో దూసుకుపోతుంది. ముఖ్యంగా సూపర్ లార్జ్ సీట్‌తో పాటు భారీ 34 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. ముఖ్యంగా టాప్ వేరియంట్‌పై క్లెయిమ్ చేసిన పరిధి అన్ని ఏథర్ స్కూటర్స్ కంటే అత్యధికంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..