Ather Electric Scooter: ఏథర్ నుంచి సరికొత్త ఎక్స్‌చేంజ్ పాలసీ.. వినియోగదారులకు అధిక ప్రయోజనాలు..

|

Mar 23, 2024 | 6:26 AM

ఏథర్ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ అనేది మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. పాత మొడళ్లైన ఏథర్ 450 జెన్ 1 జెన్ 1.5 స్కూటర్లు కలిగి ఉన్న వారు ఏథర్ 450ఎక్స్ కి అప్ గ్రేడ్ కావొచ్చు. ఈ స్కూటర్ కావాలనుకుంటే మార్చి 31లోపు వారి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఏథర్ 450 అపెక్స్ మోడల్ తీసుకోవాలనుకుంటే మాత్రం వారికి ఏప్రిల్ 30 వరకూ సమయం ఉంటుంది.

Ather Electric Scooter: ఏథర్ నుంచి సరికొత్త ఎక్స్‌చేంజ్ పాలసీ.. వినియోగదారులకు అధిక ప్రయోజనాలు..
Ather Electric Scooters
Follow us on

మన దేశంలో అత్యధికంగా అమ్ముడువుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏథర్ ఎనర్జీకి చెందనవి టాప్ ప్లేస్ లో ఉంటాయి. స్పోర్టీ లుక్లో ఇవి యూత్ ని ఆకర్షిస్తున్నాయి. అంతేకాక వాటిల్లోని ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. వాటి పనితీరు, రేంజ్ కూడా అందరినీ వాటి వైపు చూసేలా చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ ను మరింతగా పెంచుకునేందుకు ఏథర్ కొత్త ఎక్స్ చేంజ్ స్కీమ్ ను పరిచయం చేసింది. ఇప్పటికే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉన్న వినియోగదారులు తమ పాత పాత స్కూటర్లను ఇచ్చి కొత్త వాటిని తీసుకెళ్లొచ్చు. వాస్తవానికి ఈ ప్రొగ్రామ్ 2023 జనవరిలోనే ప్రారంభించింది ఏథర్ కంపెనీ. 2024 మార్చి 31 వరకూ ఈ ఎక్స్ చేంజ్ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏథర్ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ ఏంటి? వాటిల్లో ఏ స్కూటర్లను ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు? ఎంత మొత్తంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త స్కూటర్ కావాలనుకునే వారికి..

ఏథర్ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ అనేది మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుంది. పాత మొడళ్లైన ఏథర్ 450 జెన్ 1 జెన్ 1.5 స్కూటర్లు కలిగి ఉన్న వారు ఏథర్ 450ఎక్స్ కి అప్ గ్రేడ్ కావొచ్చు. ఈ స్కూటర్ కావాలనుకుంటే మార్చి 31లోపు వారి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఏథర్ 450 అపెక్స్ మోడల్ తీసుకోవాలనుకుంటే మాత్రం వారికి ఏప్రిల్ 30 వరకూ సమయం ఉంటుంది. ఆ లోపు ఎక్స్ చేంజ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. పాత స్కూటర్ ఇవ్వడంతో పాటు కొత్త స్కూటర్ ను తీసుకెళ్లడం కూడా ఒకే రోజు పూర్తి చేయొచ్చు.

ఇది తప్పనిసరి..

ఈ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ కోసం మీ వాహనాన్ని ఏథర్ స్పేస్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది బెంగళూరులోని ఇందిరానగర్లో ఉంటుంది. అక్కడ ఉన్న సిబ్బంది మీ పాత స్కూటర్ ను తనిఖీ చేసి, దాని కండిషన్ ను అంచనా వేస్తారు. అలాగే పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఫైన్లను చెక్ చేస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

వీరికి ప్రయోజనం..

ప్రీ ఓన్డ్ ఏథర్ 450 స్కూటర్లు కొన్న వారికి ఈ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ ప్రయోజనకరంగా ఉంటుంది. మీ స్కూటర్ కొని 36 నెలలు దాటి పోతే.. అలాంటి స్కూటర్ల ఎక్స్ చేంజ్ చేస్తే.. మీరు ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ ను రూ. 1.10 లక్షలు, ఏథర్ 450 ఎక్స్ స్కూటర్(3.7కేడబ్ల్యూ) ను రూ. 90,000, 45ఎక్స్(2.9కేడబ్ల్యూ) మోడల్ ను రూ. 80,000లకు కొనుగోలు చేయొచ్చు. ఒక వేళ మీ స్కూటర్ కొని 36 నెలల కన్నా తక్కువ అయితే ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వాటి రేట్లను కంపెనీ ప్రకటించలేదు.

ఏథర్ నుంచి కొత్త స్కూటర్..

ఏథర్ తన కొత్త వేరియంట్ రిజ్టా ను ఏప్రిల్ 6న లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్లో వస్తోంది. దీని మోడల్ పై కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ కొన్ని స్పై షాట్స్ ఆధారంగా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ బార్ టైప్ లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే నీరు నిల్వ ఉన్న రోడ్లలో కూడా సులభంగా ప్రయాణించగలిగేలా దీని నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెడల్పాటి ముందు టైర్ ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..