
ఏటా 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇది భారతదేశంలో అధిక ఆదాయాన్ని ఆర్జించేవారిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో సమర్పించిన తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 31, 2023 నాటికి 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఈ సంఖ్య 2.16 లక్షలకు పెరిగింది.
రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా అంచనా వేసిన సంవత్సర గణాంకాలను అందించారు. 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరంలో 1.09 లక్షల నుండి 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరంలో 1.87 లక్షలకు పెరిగింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్య డిసెంబర్ 31, 2023 నాటికి 2.16 లక్షలకు చేరుకుందని ఆయన నివేదికలో పేర్కొన్నారు.
సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సమధానమిస్తూ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జనవరి 31, 2024 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లపై గురించి తెలియజేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో ఏడాది ప్రాతిపదికన 27.6 శాతం బలమైన వృద్ధిని సాధించినట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి