
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు కమ్యూనికేషన్‌కు మాత్రమే కాకుండా చెల్లింపులు, వినోదం వంటి ఇతర విషయాల్లో కూడా ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ముఖ్యమైన కాల్‌లో ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్‌తో ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖ్యంగా బయటకు వెళ్లి మాట్లాడే సమయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మన స్మార్ట్‌ఫోన్‌లో చిన్న సెట్టింగ్ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ నాయిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చని వివరిస్తున్నారు. అయితే ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో? అలాగే మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ఎలా మార్చాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ లేదా బ్లూ టూత్ ఇయర్ బడ్స్ వంటి వాటి అవసరం లేకుండా ఫోన్ సెట్టింగ్స్ మార్చి ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో క్లియర్ కాల్ ఫీచర్ ద్వారా బ్యాక్ గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేయవచ్చు. తద్వారా కాలింగ్ నాణ్యత, హియరింగ్ క్వాలిటీ కూడా మెరుగు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు ఇయర్‌ఫోన్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఈ సెట్టింగ్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్‌ను ప్రారంభించి కాల్ నాణ్యతను మెరుగుపర్చుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి