
బ్యాంక్ ఖాతాదారులకు ఇదో బిగ్ అలర్ట్.. ఎందుకంటే వచ్చే వారంలో రెండ్రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు మూతబడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు రెండో శనివారం, నాల్గో శనివారం, అన్ని ఆదివారాలను కలుపుకుని ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. కొన్ని సెలవులు కేవలం కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలకే పరిమితం కాగా, జాతీయ సెలవు దినాల్లో మాత్రం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. SBI, HDFC వంటి బ్యాంకులకు వెళ్లే వినియోగదారులు ఆయా తేదీలను చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.
జూన్ 2026 లో బ్యాంక్ సెలవుల పూర్తి వివరాలు ఇవే
బ్యాంకులు మూసి ఉన్నా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి సేవలు
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. డబ్బులు పంపడానికి లేదా స్వీకరించడానికి గూగుల్ పే, ఫోన్ పే లేదా బ్యాంక్ మొబైల్ యాప్స్ 24 గంటలూ పనిచేస్తాయని పేర్కొంది. అలాగే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ATM కార్డ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అకౌంట్ మెయింటెనెన్స్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ సెటప్ చేయడం, లాకర్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.