VISA Apply: వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఆ వెబ్‌సైట్లు నకిలీవో, నిజమైనవో గుర్తించడం ఎలా?

|

Nov 05, 2023 | 5:42 PM

నకిలీ వెబ్‌సైట్లు.. నిజమైన వెబ్‌సైట్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. అప్పుడే విదేశాలకు వెళ్లాలనే మీ కలలు సాకారం అవుతాయి. మీరు వీసా లేదా ప్రయాణ పత్రం కోసం రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిది మీరు సందర్శించాలనుకుంటున్న దేశం రాయబార కార్యాలయం, కాన్సులేట్ ద్వారా చేయవచ్చు. లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సురక్షితమైన మార్గం. థర్డ్ పార్టీ వీసా సర్వీస్..

VISA Apply: వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఆ వెబ్‌సైట్లు నకిలీవో, నిజమైనవో గుర్తించడం ఎలా?
Visa Apply
Follow us on

మీరు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంటర్నెట్‌ని విపరీతంగా ఉపయోగించడం వల్ల సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అలాంటి స్కామ్‌లలో ఒకటి ఆన్‌లైన్ వీసాలకు సంబంధించినది. నిజానికి ఇంటర్నెట్‌.. మొత్తం వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తుంది. 2032 నాటికి ప్రపంచ ఇ-వీసా మార్కెట్ $4 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్ వీసా దరఖాస్తు ప్లాట్‌ఫారమ్‌ల పాత్ర పెరగనుంది. అయితే కొన్ని ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా… ప్రజలను మోసం చేసే సైబర్ క్రైమ్ కూడా జరుగుతోందని అస్సలు మర్చిపోకండి.

నకిలీ వెబ్‌సైట్లు.. నిజమైన వెబ్‌సైట్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. అప్పుడే విదేశాలకు వెళ్లాలనే మీ కలలు సాకారం అవుతాయి. మీరు వీసా లేదా ప్రయాణ పత్రం కోసం రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిది మీరు సందర్శించాలనుకుంటున్న దేశం రాయబార కార్యాలయం, కాన్సులేట్ ద్వారా చేయవచ్చు. లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సురక్షితమైన మార్గం. థర్డ్ పార్టీ వీసా సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం మరొక మార్గం. Atlys, ivisa.com, Visa2Fly వంటి అనేక వెబ్‌సైట్‌లు వీసా దరఖాస్తు, పొందే ప్రక్రియను సులభతరం చేస్తాయి.

సరిగ్గా ఇక్కడే సైబర్ దుండగులు అవకాశం కోసం చూస్తున్నారు. వీసా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమాచారం లేని వ్యక్తులు, లేదా వీసాలు పొందేందుకు తొందరపడే వ్యక్తులనే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. స్కామర్లు సాధారణంగా నిజమైన వీసా సర్వీస్ ప్రొవైడర్లను అనుకరిస్తూ.. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తారు. దీనివల్ల అది నిజమైన సైటో, నకిలీ ప్లాట్‌ఫారమో గుర్తించడం చాలా కష్టమవుతుంది. అందుకే ఇలాంటి మోసాల నుండి మిమ్మల్ని రక్షించే కొన్ని సంకేతాలను గమనించడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

చాలా లాభదాయకమైన, ఆకర్షణీయమైన వాగ్దానాలు ఇచ్చే సైట్ల జోలికి వెళ్లవద్దు. అలాగే తక్కువ వీసా ప్రాసెసింగ్ సమయాల గురించి హామీ ఇచ్చే సైట్‌లకు కూడా దూరంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. చౌకైన వీసాలు అందజేస్తామని నకిలీ సైట్‌లు మీకు హామీలు ఇస్తాయి. కానీ ఆ వలలో పడవద్దు. వీసాకు సంబంధించిన దరఖాస్తులను.. ఇమ్మిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీసా సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫారమ్‌లు అయితే.. దరఖాస్తుదారులకు అప్లై చేయడానికి మార్గనిర్దేశం మాత్రమే చేయగలవు. ఆ ప్రక్రియను కాస్త వేగంగా పూర్తి చేయగలవు. అంతే కాని.. చట్టపరమైన నిబంధనలను దాటి అవి ఏమీ చేయలేవు. ఎలాంటి హామీలను ఇవ్వలేవు.

నకిలీ వెబ్ సైట్‌లను నడుపుతున్న స్కామర్‌లు.. మీ నుంచి చెల్లింపులు లేదా వ్యక్తిగత వివరాలను అడుగుతారు. వారు ఇమెయిల్ ద్వారా బ్యాంక్ ఖాతా నంబర్, పాస్‌పోర్ట్ వివరాలు, వంటి సమాచారాన్ని కూడా అడుగుతారు. వివరాలన్నీ వారికి ఇచ్చారనుకోండి.. మీరు మోసపోయినట్టే అర్థం. లీగల్ వీసా సర్వీస్ ప్రొవైడర్లు అయితే.. వీసా దరఖాస్తుకు సంబంధించి మీ అర్హతలు చెక్ చేస్తారు. తరువాత అన్ని నిబంధలకు అనుగుణంగా మీ అప్లికేషన్ ఉందో లేదో చూస్తారు. ఆ తరువాతే డబ్బు చెల్లించమంటారు. ఎందుకంటే వారు కస్టమర్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లంతా చట్టప్రకారం పనిచేస్తారు.

నకిలీ సైట్‌లలో నిర్దిష్ట సంప్రదింపు వివరాలు కూడా ఉండవు. ఆ సైట్.. ఈ-మెయిల్ వంటి సేవలను అందించకపోతే అప్రమత్తంగా ఉండాల్సిందే. నిజమైన సైట్‌లు వారి సంప్రదింపు వివరాల్లో పారదర్శకంగా ఉంటాయి. వెబ్ సైట్ వారిని సంప్రదించడానికి అవసరమైన వివరాలు అక్కడ కనిపిస్తాయి. అదే నకిలీ వెబ్‌సైట్‌లను చూస్తే.. వారి సైట్ లేఅవుటే సరిగా ఉండదు. మీరు ఓపెన్ చేసిన వెబ్ సైట్ సరైనదే అయితే.. కస్టమర్ రివ్యూలను కూడా మీకు అందుబాటులో ఉంచుతుంది. నకిలీ సైట్ లలో ఇలాంటివి ఉండవు. సో.. మీరు వీసా దరఖాస్తు చేయడానికి వెబ్ సైట్ ల సహాయం కోరితే.. కచ్చితంగా ఈ వివరాలన్నీ గుర్తుంచుకోండి. అప్పుడే మోసపోకుండా ఉంటారు. మీ విదేశీ ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి