ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనీస్ దిగ్గజం హువావే రెండో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఆంక్షలను తట్టుకుని మరీ రెండో స్థానంలో నిలవడం విశేషం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు తగ్గినప్పటికీ శాంసంగ్, యాపిల్‌ను నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడింది. స్ట్రాటజీ అనలిటిక్స్ ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2.6 శాతం తగ్గి 341 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. శాంసంగ్ తన మార్కెట్ వాటాను 22 శాతం పెంచుకోగా, అందులో ఏడుశాతం హ్యాండ్‌సెట్స్ విక్రయాల ద్వారా సమకూరింది. 17 శాతం మార్కెట్ షేర్‌తో హువావే రెండోస్థానంలో నిలవగా, 11 శాతంతో యాపిల్ మూడో స్థానంలో నిలిచింది.