Apple iPhone 13 Made In India: ఆపిల్‌ కంపెనీ కీలక నిర్ణయం.. భారత్‌లో ఐఫోన్‌ -13 తయారీ ప్లాంట్‌.. ఎక్కడో తెలుసా..?

|

Dec 22, 2021 | 2:05 PM

Apple iPhone 13 Made In India: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ హవా కొనసాగుతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల..

Apple iPhone 13 Made In India: ఆపిల్‌ కంపెనీ కీలక నిర్ణయం.. భారత్‌లో ఐఫోన్‌ -13 తయారీ ప్లాంట్‌.. ఎక్కడో తెలుసా..?
Follow us on

Apple iPhone 13 Made In India: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ హవా కొనసాగుతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రపంచ దేశాలలో మొబైల్‌ మార్కెట్‌ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా మారింది. కొన్ని మొబైల్‌ తయారీ కంపెనీలు భారత్‌ లో మొబైళ్లను తయారు చేసే విధంగా దృష్టి సారిస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ఆపిల్‌ భారత్‌లో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఆపిల్‌ ఐఫోన్‌ తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్‌ ఐఫోన్‌ 13 ట్రయల్‌ తయారీని సైతం ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ట్రయల్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. ఫిబ్రవరి నాటికి దేశీయ మార్కెట్‌ ఎగుమతుల కోసం ఫిబ్రవరి నాటికి దేశీయ మార్కెట్‌ ఎగుమతుల కోసం ఇండియాలో ఐఫోన్‌ 13 ఉత్పత్తిని ప్రారంభించాలని ఆపిల్‌ భావిస్తోంది.

ఆపిల్‌ సెమీకండక్టర్‌ చిప్‌ల సరఫరాను కూడా ప్రారంభించింది. ఇండియాలో తయారు చేసిన వాటిలో 20 నుంచి30 శాతం ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే దీనిపై ఆపిల్‌, ఫాక్స్‌కాన్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆపిల్ ఐఫోన్ 13 ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించాలని భావిస్తున్నట్టు నివేదిక తెలిపింది. అయితే ఆపిల్ ఇప్పటికే చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 11, ఐఫోన్ 12లను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ ఎస్ఈ (iPhone SE) బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు. భారత్‌లో ఆపిల్ విక్రయించే దాదాపు 70 శాతం స్మార్ట్‌ఫోన్‌లను దేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది భారత్ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి:

India Post Payments Bank: క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్‌.. ఛార్జీల బదుడు.. జనవరి 1 నుంచి అమలు

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు