Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో iOS 26.3.1 అప్‌డేట్!

Apple iOS 26.3.1 అప్‌డేట్ త్వరలో విడుదల కానుంది. ఇది ప్రధానంగా బగ్ పరిష్కారాలు, భద్రతా ప్యాచ్‌లపై దృష్టి సారించి, ఐఫోన్ పనితీరును స్థిరంగా ఉంచుతుంది. మార్చిలో రాబోయే ఆపిల్ ఉత్పత్తుల ప్రకటనలకు (కొత్త మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు వంటివి) ముందు ఈ అప్‌డేట్ కీలకమైనది.

Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో iOS 26.3.1 అప్‌డేట్!
Apple Ios 26.3.1

Updated on: Feb 23, 2026 | 10:02 PM

మార్చి ప్రారంభంలో రాబోయే ఉత్పత్తి ప్రకటనలకు సన్నాహాలు చేస్తున్న సమయంలో Apple మరో ఐఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ iOS 26.3.1 ఇంటర్నల్‌ టెస్టులు ప్రారంభించింది. ఈ అప్‌డేట్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని సంకేతాలు కనిపిస్తున్నాయి. మాక్‌రూమర్స్ సందర్శకుల లాగ్‌లలో కనిపించిన డేటా ఆధారంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇటువంటి పరీక్షలు పబ్లిక్ లాగ్‌లలో కనిపించిన తర్వాత, చిన్న వ్యవధిలోనే అప్‌డేట్ విడుదల అవుతుంది. దీంతో రాబోయే రెండు వారాల్లో iOS 26.3.1 విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ అప్‌డేట్ ప్రధానంగా చిన్న విడుదలగా ఉండనుంది. కొత్త ఫీచర్ల కంటే బగ్ పరిష్కారాలు, భద్రతా ప్యాచ్‌లపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో విడుదలైన iOS 26.3, మార్చి చివరలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే భారీ iOS 26.4 అప్‌డేట్ మధ్య ఈ వెర్షన్ నిలుస్తుంది. అయితే iOS 26.4లో Apple Music, పాడ్‌కాస్ట్‌లు, కార్‌ప్లే వంటి సేవల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీనితో పోలిస్తే iOS 26.3.1 ఐఫోన్‌ల పనితీరును స్థిరంగా ఉంచే నిర్వహణ అప్‌డేట్‌గా భావిస్తున్నారు.

గత నెలలో కూడా ఆపిల్ ఇదే విధానాన్ని అనుసరించింది. iOS 26.2.1 ద్వారా బగ్ ఫిక్స్‌లు అందించడంతో పాటు రెండో తరం ఎయిర్‌ట్యాగ్‌కు మద్దతు జోడించింది. అదే తరహాలో iOS 26.3.1లో కూడా త్వరలో విడుదల కానున్న కొత్త ప్రొడక్ట్స్‌కు ఇంటర్నల్‌ సపోర్ట్‌ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక మార్చి 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు ఆపిల్ పలు ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. సంప్రదాయ కీనోట్‌కు బదులుగా న్యూయార్క్, లండన్, షాంఘైలలో జరిగే “ఆపిల్ ఎక్స్‌పీరియన్స్” కార్యక్రమంలో ఎంపిక చేసిన జర్నలిస్టులకు ప్రదర్శనలు ఇవ్వనుంది.

Mark Gurman తెలిపిన వివరాల ప్రకారం రాబోయే ప్రకటనల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, చిప్‌లతో కలిపి కనీసం ఐదు కొత్త ఉత్పత్తులు ఉండే అవకాశం ఉంది. కొత్త తక్కువ ధర మ్యాక్‌బుక్, అప్డేటెడ్‌ మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు, రిఫ్రెష్ ఐప్యాడ్‌లు, కొత్త స్టూడియో డిస్ప్లే కూడా రావచ్చని అంచనా. మొత్తానికి, iOS 26.3.1 పెద్ద మార్పులు లేకపోయినా, కొత్త లాంచ్‌లకు ముందు ఐఫోన్‌లను స్థిరంగా ఉంచే కీలక అప్‌డేట్‌గా నిలవనుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us