Apple Airpods: హైదరాబాద్ నుంచే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఎగుమతులు.. కీలక ప్రకటన వచ్చేసిందోచ్..!

|

Mar 18, 2025 | 3:30 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను పరిచయం చాలా దేశాల్లో ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ దెబ్బకు యాపిల్ ఖర్చు తగ్గించుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది.

Apple Airpods: హైదరాబాద్ నుంచే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఎగుమతులు.. కీలక ప్రకటన వచ్చేసిందోచ్..!
Apple Airpods
Follow us on

ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఎగుమతుల కోసం ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించాలని యాపిల్ యోచిస్తున్నట్లు నిపునులు చెబుతున్నారు. ఐఫోన్‌ల తర్వాత ఆపిల్ భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించే రెండో ఉత్పత్తిగా ఎయిర్‌పాడ్‌లు ఉండనున్నాయి. భారతదేశంలో ఫాక్స్‌కాన్ హైదరాబాద్ కేంద్రంలో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇది ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని, కానీ ప్రస్తుతానికి ఇది ఎగుమతులకు మాత్రమేనని యాపిల్ పరిశ్రమల వర్గాలు చెబుతున్నారు. ఆగస్టు 2023లో ఫ్యాక్టరీని స్థాపించడానికి ఫాక్స్‌కాన్ 400 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3,500 కోట్లు ఆమోదించింది. 

ప్రపంచవ్యాప్తంగా టీడబ్ల్యూఎస్ (నిజమైన వైర్‌లెస్ పరికరం) విభాగంలో ఆపిల్ అగ్రగామిగా ఉంది. 2024లో ఈ కంపెనీ 23.1 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది యాపిల్ సమీప పోటీదారు శామ్‌సంగ్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. వివధ పరిశోధన సంస్థల అంచనా ప్రకారం ఇది దాదాపు 8.5 శాతంగా ఉంటుంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల తర్వాత  ముఖ్యంగా కంపెనీ అమెరికాలో తయారీ యూనిట్లలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 500 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన తర్వాత ఆపిల్ దేశంలో ఉత్పత్తిని తగ్గించవచ్చనే ఊహాగానాల మధ్య భారతదేశంలో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ పంచుకున్న డేటా ప్రకారం భారతదేశం హియరబుల్స్, ధరించగలిగే వస్తువులపై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తుంది. అయితే వీటిపై యూఎస్‌లో ఎలాంటి సుంకం విధించరు. 

స్మార్ట్‌ఫోన్‌లు, హియరబుల్స్, ధరించగలిగే వస్తువులపై దిగుమతి సుంకాన్ని యూఎస్ నుంచి దిగుమతులపై మాఫీ చేస్తే భారతదేశం లాభపడుతుందని ఐసీఈఏ ప్రతిపాదించింది. ఏప్రిల్ 2 నుంచి భారతదేశంతో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాన్ని విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది . అయితే ఈ వార్తల నేపథ్యంలో కొంత మంది నిపుణులు యాపిల్, ఫాక్స్‌కాన్‌లకు పంపిన మెయిల్స్‌కు కంపెనీ అధికారికంగా స్పందించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి