Apple Watch: భారత్‌ అంటే మీకు లెక్కలేదా..? యాపిల్‌ సంస్థపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన నటుడు

|

Sep 17, 2021 | 10:49 AM

Apple Watch: యాపిల్‌ ఉత్పత్తులకు భారతదేశంలో మంచి ఆదరణ ఉంది. యాపిల్‌ ప్రొడక్టులు అంటే ఎంతోగానే ఇష్టపడుతుంటారు భారతీయులు. అంతేకాదు..

Apple Watch: భారత్‌ అంటే మీకు లెక్కలేదా..? యాపిల్‌ సంస్థపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన నటుడు
Follow us on

Apple Watch: యాపిల్‌ ఉత్పత్తులకు భారతదేశంలో మంచి ఆదరణ ఉంది. యాపిల్‌ ప్రొడక్టులు అంటే ఎంతోగానే ఇష్టపడుతుంటారు భారతీయులు. అంతేకాదు.. యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోళ్లలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని కూడా చెప్పవచ్చు. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్‌ను భారత్‌ నుంచే ఎక్కువ మంది లైవ్‌లో వీక్షించారు. అయితే యాపిల్‌ మాత్రం భారత్‌ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అంటే అవుననే అంటున్నారు సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌ ఫిఫ్త్‌ ఎవెన్యూలోని యాపిల్‌ స్టోర్‌ను మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్‌ కలెక్షన్‌ పేరుతో కొన్ని స్మార్ట్‌ వాచీలను డిస్‌ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్‌ జెండా కనిపించకపోయే సరికి ఆయన నిరాశ చెందారు. దీంతో అక్కడి వాచీలను వీడియో తీసి ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ పెట్టారు.

స్మార్ట్‌ వాచీ కలెక్షన్‌ బాగుంది. కెనెడా, ఆసీస్‌, ఫ్రాన్స్‌.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్‌ ఉంచారు. కానీ, అందులో భారత్‌ జెండా మాత్రం కనిపించలేదు. జెండా లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్లు చెప్పుకొచ్చారు. యాపిల్‌ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు అధికంగా భారత్‌లోనే ఉన్నారు కదా.. మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే యాపిల్‌ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

 

ఇవీ కూడా చదవండి:

Hero MotoCorp: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరగనున్న హీరో ద్విచక్ర వాహనాల ధరలు.. ఎంతంటే..!

Farmers: రైతులందరికీ ఈ పథకం మరో వరం లాంటిది.. రూ.16 లక్షల కోట్లు టార్గెట్‌ పెట్టుకున్న మోడీ ప్రభుత్వం..!